జనవరి 15వ తేదీన చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి.

 

 

 త్రిపురనేని రామ స్వామి జననం  : 1887 జనవరి 15 వ తేదీన త్రిపురనేని రామస్వామి జన్మించారు. ఆయన న్యాయవాది మరియు ప్రముఖ హేతువాద రచయిత సంఘసంస్కర్త. ప్రసిద్ధ కవి రాజు గా పిలవబడే ఈయన హేతువాద మరియు మానవతావాదం తెలుగు కవిత్వం సాహిత్యం లను ... మొదటిసారి ప్రవేశపెట్టిన కవిగా  భావిస్తూ ఉంటారు. 

 

 చాగంటి సోమయాజులు : చాగంటి సోమయాజులు రచనలు అన్ని తెలుగు ప్రజలకు కొసమెరుపు. చాగంటి సోమయాజులు తెలుగు ప్రజలందరూ ఛాసో గా  పిలుచుకుంటారు. ఈయన  మొట్టమొదటి రచన చిన్నజి  1942 భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. చాగంటి సోమయాజులు 1915 జనవరి 15వ తేదీన జన్మించారు.ఇక  ఈయన పీడిత ప్రజల సమస్యలు ధనస్వామ్యం గురించి ఆయన రచనలు రాసేవారు. ముఖ్యంగా చాగంటి సోమయాజులు రాసిన రచనలు.. పేద ప్రజల బాధలు ధనస్వామ్యం పైనే ఉండేవి.  అప్పట్లో చాగంటి సోమయాజులు రచించిన రచనలు పేద ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయి. 

 

 

 వియస్ రమాదేవి జననం: భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ అడ్మినిస్ట్రేటర్ గా  పేరుగాంచిన డాక్టర్ వి ఎస్ రమాదేవి 1934 జనవరి 15వ తేదీన జన్మించారు. ఈమె  భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు.

 

 మాయావతి జననం  : భారతదేశంలోనే మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన దళిత మహిళ మాయావతి. బహుజన సమాజ్ వాది పార్టీ నుంచి ఈమె  ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు తెగ  అయినా జాదవ్ అనే కులానికి చెందినవారు మాయావతి. 2007 సంవత్సరంలో ఎన్నో అడ్డంకులను అధిగమించి వృక్షాలను చేరుకున్న ప్రపంచంలోనే ఎనిమిది మంది మహిళలలో  ముఖ్యమంత్రిగా మొదటి దళిత మహిళ గా పదవీ బాధ్యతలు చేపట్టి ఎన్నికయ్యారు మాయావతి . ఇప్పటికీ ఈమె ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఎంతో ప్రభావితం చేస్తున్నారు. 1956 జనవరి 15వ తేదీన జన్మించారు మాయావతి.

 

 

 క్రికెటర్ తిలక్ రాజ్  జననం : 1960 జనవరి 15వ తేదీన ఢిల్లీలో తిలక్ రాజ్  జన్మించారు. ఈయన ఇండియా మాజీ క్రీడాకారుడు. ఈయన వేసిన ఓవర్లోనే రవిశాస్త్రి ఆరు బాళ్లకు  ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: