ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో చేస్తున్న పోరాటం ఇప్పుడు ఏపీ మీడియా వర్గాల్లో అదేవిధంగా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అమరావతి ప్రాంతంలో ఇప్పటికే కుటుంబ సమేతంగా పోరాటం చేసిన చంద్రబాబు ఏపీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అమరావతి పరిరక్షణ యాత్ర పేరిట చంద్రబాబు తలపెట్టిన కార్యక్రమం రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో పెనుగొండ లో జరిగింది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పెనుగొండ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర ప్రజల దగ్గర జోలె పట్టి విరాళాలు సేకరించారు. అనంతరం చంద్రబాబు సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసిపి ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలంటే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతి రాజధానిని విశాఖకు మార్చుకోవాలని సూచించారు.

 

అలా జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు చంద్రబాబు. ఐతే ఎన్నికలకు సీఎం జగన్ ఎలాగూ ఒప్పుకోరని.. అందుకే అమరావతి, విశాఖపై ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు దేన్ని కోరుకుంటే అక్కడే రాజధానిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మరోపక్క ఇదే యాత్రలో చంద్రబాబు పై అనంతపురం జిల్లా వాసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకుని...వికేంద్రీకరణ పేరిట సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబు కాన్వాయ్ పై చాలా మంది రాయలసీమ వాసులు దూసుకెళ్లి పోయారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు ఉండటంతో వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: