అమరావతి పరిరక్షణ సమితికి ఉన్న పొలిటికల్ ఫేస్ పోవడం లేదు. రాజధాని పోరాటంలో జాయింట్ యాక్షన్ కమిటీకి సరైన నాయకత్వం లభించలేదనే వాదన వినిపిస్తోంది. అన్ని పక్షాల తరుపున ఏర్పాటైన జేఏసీకి ఆ రూపు మాత్రం రావడం లేదు. క్యాపిటల్ పోరాటంలో ఇతర పార్టీలు అంటీముట్టనట్టుగానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 

 

అమరావతి పోరాటం ఉధృతం అవుతోంది. రాజకీయ పక్షాలు, వ్యాపార, ప్రజా సంఘాలు కలిసి జెఎసీ గా ఏర్పడి చేస్తున్న ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పేరుకు అన్ని వర్గాలతో, పార్టీలతో ఏర్పడిన జేఏసి అని చెపుతున్నా....పొలిటికల్ ఫేస్ తోనే జేఎసీ నడుస్తుంది. రాష్ట్ర స్థాయిలో జేఎసీని నడిపంచే ఫేస్ లేకపోకవడం ప్రధాన ఇబ్బందిగా మారింది. శివారెడ్డి ని కన్వీనర్ గా పెట్టిన ఏర్పాటు చేసిన జేేఏసీ ఆధ్వర్యంలోనే నిరసనలు, పోరాటాలు జరుగుతున్నాయి. లాయర్లు, డాక్టర్లు, క్రెడాయ్ ప్రతినిధులు కూడా ఇందులో భాగాస్వాములు అవుతున్నారు. 29 గ్రామాల పోరాటానికి మద్దతుగా జేఏసీ చేస్తున్న కార్యక్రమాలు మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. ఇదే సమయంలో జేఏసీ నేతలతో కలిసి చంద్రబాబు చేపడుతున్న జిల్లా పర్యటనలకు కూడా మంచి స్పందనే వస్తుందని  అమరావతి పరిరక్షణ సమితి నేతలు చెపుతున్నారు. బందరు లో జేఏసీ పెట్టిన మీటింగ్ కు అనుకున్న స్థాయిలో స్పందన రాకపోయినా...రాజమండ్రి, చిత్తూరుజిల్లాలలో బాగా జరిగిందని నేతలు చెపుతున్నారు. ఇక నర్సారావు పేటలో జరిగిన మీటింగ్ కూడా అనుకున్న దానికంటే బాగా జరిగినట్లు టీడీపీ నేతలు చెపుతున్నారు. పేరుకు అమరావతి జేఏసీ సభలు, ర్యాలీలు అని చెపుతున్నా ఇవన్నీ కూడా తెలుగు దేశం పార్టీ మద్దతుతోనే జరుగుతున్నాయి. 

 

రాజధాని పోరాటానికి రాజకీయ రంగు అంటకుండా చూడాలని తెలుగు దేశం ప్రయత్నించింది. దీనిలో భాగంగానే అన్ని సంఘాలు, పార్టీలతో ఏర్పాటు చేసిన జేఏసీ తో కలిసి పని చేయాలని నిర్ణయించింది. జేఏసీని ముందు ఉంచి వారి ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని నిర్ణయించింది. అయితే జేఏసీకి ఇప్పటి వరకు ఆ స్థాయి గుర్తింపు రాలేదు. ఏ జిల్లాలకు ఆ జిల్లాలు జేఏసీగా పెట్టుకొవడం ప్రధాన అవరోధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీని ఏర్పాటు చేయలేకపోవడం ప్రధాన ఇబ్బందిగా మారింది. మరోవైపు జేఏసీకి నాయకత్వం విషయంలో కూడా అనుకున్న స్థాయిలో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తులు గాని, సంఘాలు గాని ఫేస్ గా లేకపోవడం ప్రధాన అవరోధంగా మారింది. దీంతో జేఏసీ పర్యటనలు, కార్యక్రమాలు అన్ని టీడీపీ ఫేస్ తో జరగాల్సి వస్తుంది. అమరావతి పరిరక్షణకు జెఎసి నేతృత్వంలో జరుగుతున్న జిల్లా ర్యాలీలు కూడా పూర్తిగా టీడీపీ ర్యాలీలుగా మారిపోయాయి. party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ నుంచి రామకృష్ణ పాల్గొంటున్నా....అది ఆయన వరకే పరిమితం అయింది. .

 

దీంతో అనుకున్న లక్ష్యం ఒకటి కాగా....జేఏసీ పేరిట జరుగుతున్న సభలు మరోలా సాగుతున్నాయి. చంద్రబాబు ముందు ఉండకపోతే...ఈ స్థాయి సభలు, సమావేశాలు జరిగే అవకాశం కూడా లేదు. ఇప్పటికే పోలీసు కేసులతో బయపడుతున్న వారు ఉద్యమంలోకి రావాలంటే రాజకీయ అండకావాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒక వేళ చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగకపోతే ఈ స్థాయిలో సభలు, ర్యాలీలు జరిగే అవకాశం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు అధికార పార్టీ కూడా జేఏసీకి కౌంటర్ ఇచ్చేందుకు ర్యాలీలు చేపడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు టూర్లు టార్గెట్ గా ఆయా జిల్లాలలో మూడు రాజధానులకు మద్దతుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ జిల్లాలలో గో బ్యాక్ చంద్రబాబు అంటూ వైసీపీ నిరసనలు మొదలు పెట్టింది. దీంతో ఇది వైసీపీ, టీడీపీ మద్య ఉద్యమంగా మారిపోయే ప్రమాదం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అలా అని చంద్రబాబు దూరంగా ఉండే ఉద్యమం ముందుకు వెళ్లదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే సీపీఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జేఏసీకి దూరంగా ఉంటున్నారు. రాజధాని ఆందోళనలకు సీపీఎం కార్యదర్శి మధు మద్దతు తెలిపారు. అయితే జేఏసీతో కలిసి సమావేశాలకు రావడానికి ఆయన ఇష్ట పడడం లేదు. మరోవైపు బీజేపీ ఒంటిరిగా పోరాటాలకు సిద్దం అవుతుంది. జనసేన నుంచి నేతలు వస్తున్నా...ఆ పార్టీ ఉన్న ముఖ్యనేతలు జేఏసీ మీటింగ్ లకు రావడం లేదు. దీంతో జేఏసీ పోరాటం గా చెపుతున్న ఉద్యమం అంతా...టీడీపీ పోరాటంగా కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: