ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సమయంలో ఈ రెండు జిల్లాల్లో కోడి పందేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక్కడ కోడిపందేల్లో పాల్గొనటానికి ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చి పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. కోడి పందేలను చూడటానికి వచ్చే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. 
 
కోడి పందేలను జరపటానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా పచ్చని పంట పొలాల మధ్య నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం గోదావరి జిల్లాల పోలీసులు కూడా కోడి పందేలను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
గోదావరి జిల్లాల్లోని పోలీసులు పలు ప్రాంతాలలో ఇప్పటికే కోడి పందేలను నిర్వహించడం చట్టరిత్యా నేరం అని హెచ్చరికలు జారీ చేస్తూ శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. కొన్ని చోట్ల కొబ్బరి తోటలలో వేసిన టెంట్లను కూడా పోలీసులు ఇప్పటికే తొలగించారు. బరుల కొరకు చేసిన ఏర్పాట్లను కూడా పోలీసులు ఇప్పటికే ధ్వంసం చేశారు. నిర్వాహకులకు నిబంధనలను అతిక్రమించి కోడి పందేలను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 
 
ఐ పోలవరంలో పోలీసులు దాడులు జరిపారు. తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు చర్యలు తీసుకుంటోన్నా మరికొన్ని ప్రాంతాలలో మాత్రం కోడి పందేలు యథేచ్చగా జరుగుతున్నాయి.వైసీపీ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దగ్గరుండి కోడి పందేలను జరుపుతూ ఉండటం గమనార్హం. పోలీసులు శిబిరాలను తొలగిస్తూ ఉండటం, కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటన చేయటంతో కొన్ని ప్రాంతాలలో కోడి పందేల నిర్వాహకులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: