హై పవర్ కమిటీ మూడో సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చ జరిపింది. సీఆర్డీఏ స్థానంలో అమరావతి డెవలప్ మెంట్ ఏర్పాటు గురించి కమిటీ ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వానికి రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన గురించి కమిటీ సిఫారసు చేసింది. కాజా టోల్ గేట్ దగ్గరినుండి అమరావతి సీడ్ క్యాపిటల్ ప్రాంతం మీదుగా విజయవాడకు యాక్సిస్ రహదారి నిర్మాణానికి సిఫార్సు చేసింది. 
 
అమరావతి సీడ్ కేపిటల్ ప్రాంతం, నున్నలను కలుపుతూ యాక్సిస్ రోడ్డు వేయాలని కమిటీ సూచనలు చేసింది. మే జూన్ నెలలలో పనులు ప్రారంభించే విధంగా కార్యాచరణ చేయాలని ప్రభుత్వానికి కమిటీ సూచనలు చేసింది. రాజధానిలో రైతులు ఫ్లాట్లు వద్దనుకున్న పక్షంలో రైతులకు భూమిని తిరిగి ఇచ్చేయాలనే ప్రతిపాదనల గురించి కూడా హై పవర్ కమిటీ చర్చించింది. 
 
హై పవర్ కమిటీ వారు ఇచ్చిన భూమి కాకుండా వేరే భూమి కేటాయింపుల గురించి కూడా చర్చలు జరిపింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ తరహాలో లే అవుట్ల అభివృద్ధి సాధ్యం కాదని హై పవర్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. మచిలీపట్నం అర్బన్ అథారిటీ డెవలప్ మెంట్ సహా ఇతర పట్టణాభివృద్ధి సంస్థలను కలిపే అంశం గురించి కూడా చర్చ జరిపింది. ఈరోజు విజయవాడ కాన్ఫరెన్స్ హాలులో హై పవర్ కమిటీ సమావేశం జరిగింది. 
 
హై పవర్ కమిటీ సమావేశం తరువాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రైతులు తాము ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో రాతపూర్వకంగా సీ.ఆర్.డీ.ఏ కమిషన్ కు డైరెక్ట్ గా లేదా ఆన్ లైన్ ద్వారా ఇవ్వొచ్చని సూచనలు చేశారు. ప్రభుత్వానికి నేరుగా సూచనలు, సలహాలు చెప్పొచ్చని పేర్ని నాని అన్నారు. హై పవర్ కమిటీ ఈ నెల 17వ తేదీన మరోసారి సమావేశం జరపనుందని తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు అంశం గురించి కూడా కమిటీ కూలంకుషంగా చర్చించినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: