అమరావతి రాజధాని రైతుల్లో చీలిక వచ్చిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం మొదలైంది. రాజధాని అమరావతిని తరలించేందుకు వేల్లేదంటూ 28 రోజులుగా  రాజధాని ప్రాంతంలోని ఓ ఐదారు గ్రామాల్లోని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.  రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల్లోని రైతులు భూములిచ్చినా ఇపుడు జరుగుతున్న గోలంతా కేవలం ఐదారు గ్రామాల్లో మాత్రమే కేంద్రీకృతమైంది.

 

జరుగుతున్న ఆందోళనలకు రాజధాని గ్రామాల్లోని మందడం, ఉద్దండరాయునిపాలెం, ఎర్రబాలెం, తుళ్ళూరు, పెనుమాక గ్రామాలు మాత్రమే కీలకంగా ఉన్నాయి. అయితే మూడు రోజుల క్రితం ఓ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగిందని పార్టీ వర్గాలు చెప్పాయి. మండడంలోని కొందరు రైతులు అంటే ప్రధానంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు మంత్రి కొడాలి నానితో భేటి అయ్యారట.

 

రైతులు మంత్రితో ఎందుకు భేటి అయ్యారయ్యా అంటే రాజధాని తరలింపు విషయం, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు తదితరాలపై చర్చించేందుకే. రైతులతో మంత్రి మాట్లాడుతూ రాజధాని తరలింపు తథ్యమని  స్పష్టం చేశారట. కాబట్టి రాజదాని అమరావతిలోనే ఉండాలనే విషయాన్ని పక్కనపెట్టేసి ప్రత్యామ్నాయ ప్రయోజనాల విషయంలో ఏవైనా డిమాండ్లు ఉంటే చెప్పాలని రైతులను మంత్రి కోరినట్లు సమాచారం.

 

చంద్రబాబనాయుడు హయాంలోనే రైతులకు ఏ విధంగా అన్యాయం జరిగిందనే విషయాన్ని  లెక్కలతో సహా మంత్రి  వివరించారట. రాజధానిని అమరావతి నుండి తరలించినా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను మంత్రి రైతులకు డీటైల్డుగా  వివరించారు. చంద్రబాబు హయాంలో రైతులకు అందిన ప్రయోజనాలకన్నా తమ ప్రభుత్వం అందించబోయే ప్రయోజనాలు ఏ విధంగా మెరుగ్గా ఉండబోతోందన్న విషయాలపైన కూడా క్లారిటి ఇచ్చారట.

 

రైతులకు డీటైల్డుగా మాట్లాడిన కొడాలి పనిలో పనిగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కూడా పిలిపించి రైతులకు తగిన హామీలనిప్పించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అంటే జగన్ తరపున మంత్రులిద్దరూ రైతులతో భేటి అయినట్లు తెలిసిపోతోంది. చంద్రబాబు మాటలు నమ్మి ఆందోళనలు చేస్తే నష్టాలే తప్ప ఉపయోగాలుండదని రైతులు గ్రహించాలని కూడా నాని చెప్పారట.

 

చంద్రబాబు మాయలో పడి రెండోసారి కూడా నష్టపోవద్దని జగన్ ను నమ్మకుని లాభపడాలని నాని చెప్పారు. ఈ విషయంలో మంత్రులు గనుక సక్సెస్ అయితే రైతుల ఆందోళన ఒక్కసారిగా ఆగిపోవటం ఖాయమే. మరపుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: