యుద్ద వాతావరణం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన సంగతి విధితమే. కేవలం రెండు నెలలలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఎంత పెరిగాయి అంటే రెండు నెలలో 6 రూపాయిలు పెరిగింది. అంత పెరిగిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం భారీగా తగ్గాయి.                   

 

ఎంత తగ్గాయి ఏంటి అనుకుంటున్నారా ? పెట్రోల్ పై 11 పైసలు, డీజిల్ పై 5 పైసలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఈ పెట్రోల్, డీజిల్ ధర తగ్గుదలకు ప్రధాన కారణం. దీంతో నేడు సోమవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.60 వద్దకు చేరగా, డీజిల్ ధర రూ.75.30కు చేరుకుంది.               

 

ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అమరావతిలో 20 పైసలు తగ్గుదలతో పెట్రోల్ ధర 80.34 రూపాయలకు దగ్గరకు చేరగా, డీజిల్ ధర కూడా 12 పైసలు తగ్గుదలతో 74.22 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. విజయవాడలోను ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 61.35 డాలర్లకు క్షీణించింది. అయితే గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 6 రూపాయిలు పెరిగింది. ఇప్పుడు కేవలం రెండు నెలలో 80 రూపాయిలు అయ్యింది. ఇలాగే ఉంటె ఇంకొక నెలలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయిలు అవుతుంది. కాగా ఇప్పుడంటే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి కానీ భవిష్యేత్తులో ఇంకా ఇంకా పెరుగుతాయిట... దీన్ని బట్టి చేస్తే వాహనదారులు అంత కూడా భవిష్యేత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తప్పవు ఏమో అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: