జనవరి 16వ తేదీన ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరు చూద్దాం రండి..

 

 

 పరుచూరి హనుమంతరావు జననం : 1921 జనవరి 16వ తేదీ కృష్ణా జిల్లాలో జన్మించారు. నిరు పేద రైతు కుటుంబంలో జన్మించారు పరుచూరి హనుమంతరావు. బొంబాయి పీపుల్స్ థియేటర్లు ఈయన బల్రాజ్ సహానితో  నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు పరుచూరి హనుమంతరావు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి కొందరు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు. సామాజిక కార్యకర్తగా  కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు పరుచూరి హనుమంతరావు. ప్రగతి ప్రింటర్స్ స్థాపించి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తమ ముద్రణాలయం గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు పరుచూరి హనుమంతరావు. ఆఫ్ సెట్  ముద్రణా యంత్రం... కంప్యూటర్ కంట్రోల్ తో సహా దేశంలోనే మొదటిసారిగా 1988 సంవత్సరంలో ఇక్కడి ప్రవేశించింది. 

 

 

 సూదిని జైపాల్ రెడ్డి జననం : కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 1942 జనవరి 16వ తేదీన జన్మించారు.ఎన్నో ఏళ్ళు  రాజకీయాలు కొనసాగిన ఈయన సేవ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని మాడుగుల లో జన్మించారు. ఈయన కేంద్ర మంత్రి గానే కాకుండా పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నోసార్లు విజయం సాధించి పార్లమెంటులో తనదైన  శైలిలో వాదనలు ప్రతి వాదనలు వినిపించారు. రెండు సార్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జైపాల్ రెడ్డి చట్టసభలలో చేసిన డిబేట్ లు అన్నీ అత్యంత కీలకమైనవి గానే ఉంటాయి. కీలకమైన అంశాల్లో చట్టసభల్లో ఆయన గొంత్తెత్తి  మాట్లాడారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్గా 1988లో ఎన్నుకోబడ్డారు. 

 

 

 సిద్ధార్థ మల్హోత్రా : ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా.. 1985 జనవరి 16వ తేదీన జన్మించారు. 18వ యేటే మోడల్ వృత్తి లోకి ప్రవేశించిన సిద్ధార్థ్ మల్హోత్ర ఆ తర్వాత 2010లో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ వద్దా... సహాయ దర్శకునిగా చేరి బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. 2012 సంవత్సరంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా రంగప్రవేశం చేశారు సిద్ధార్థ్ మల్హోత్రా. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని బాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగారు సిద్ధార్థ్ మల్హోత్రా. బాలీవుడ్ సినిమాల్లో తన సత్తా చాటుతూ మరోవైపు ఎన్నో రకాల బ్రాండ్ల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా కొనసాగారు సిద్ధార్థ మల్హోత్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: