ఆంధ్ర ప్రదేశ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. జనవరి 13న సోమవారం  ప్రగతి భవన్‌ లో ఇరువురు సీఎంల భేటీ మొదలైంది.. ఈ సమావేశం లో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని రాజదాని విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర ఆంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.. తాజా రాజకీయ అంశాల పై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

మరో విషయమేంటే  ఏపీలో మూడు రాజధానుల అంశం, తెలంగాణ లో రానున్న మున్సిపల్ విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్‌ లోని సంస్థల విభజన, ఇతర పెండింగు అంశాలపైనా ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్‌ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలపై చాలా చర్చలు సాగాయి..

 

ఇద్దరు సీఎంలు గతంలో మూడు సార్లు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో లంచ్ తర్వాత ఈ భేటీ కొనసాగింది..అయితే  గతంలో చాలా సార్లు ఈ సీఎం లు కొన్ని సందర్భాల్లో ప్రగతి భవన్ లో కలిశారు..

 

జగన్ సీఎం అయ్యాక తెలుగు రాష్ట్ర ప్రజా సమస్య లపై మొదటి సారి భేటీ అయ్యారు. చేరుకున్న వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు..వీరి నేటి రాష్ట్ర ప్రజల కు మేలు జరుగుతుందని సదరు అభిప్రాపడుతున్నారు..వైసీపీ నేతలు ఈ భేటీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: