ప్రస్తుతం అమరావతిలో మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ మూత రాజధానులు ఏర్పడే అవకాశం ఉందని ప్రకటన చేయడం.. రాజదాని  అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన రెండు కమిటీలు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదిక అందించడంతో రాజధాని రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్నారు అమరావతి నిర్మాణం కోసం పంట పండించే భూములకు త్యాగం చేశామని ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలిస్తాము అంటే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రైతు కుటుంబీకులు రోడ్డెక్కి నిరసనలు ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అమరావతి వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినప్పటికి కూడా రైతులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీలు సైతం చేస్తున్నారు. 

 

 

 అమరావతి మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇకపోతే విపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల నిరసన కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసింది. ఏకంగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జోలిపట్టి విరాళాలు సైతం సేకరిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని విపక్ష నేత చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు మాటలు ఎవరూ నమ్మవద్దని రైతులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు మంత్రి కూడా. లక్ష కోట్లు ఖర్చు చేస్తే అభివృద్ధి చెందేది ఒక్క ప్రాంతమేనని అదే డబ్బుతో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చు ఉంటూ కొడాలి నాని తెలిపారు. 

 

 

 హైదరాబాద్ ను కూడా తానే నిర్మించానని సిగ్గులేకుండా చంద్రబాబు చెబుతున్నాడని... సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త హరిదాసు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశాడు కొడాలి నాని. మూడు రాజధానుల కు మద్దతుగా మచిలీపట్నంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగానే టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రిగా కొడాలి నాని . చంద్రబాబు జోలె పట్టడాన్ని ఉదాహరిస్తూ కొడాలి నాని ఈ సెటైర్లు వేసినట్లు అర్థమవుతుంది. అయితే అటు అధికార వైసీపీ నేతలు అందరూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: