ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానం సరైంది కాదని సీనియర్ నాయకులు, మాజీ ఎంపి  రాయపాటి సాంబశివ రావు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ది పొందేందుకే ఆనాడు మోడీని దూరం పెట్టారని చంద్రబాబు వైఖరిని ఎట్టి చూపారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలవాలని టిడిపి అధినేత  చంద్రబాబుకి సీనియర్లు తెలుపుతామని అన్నారు. తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో విభేదించి తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ఫెయిల్యూర్ నేతగా బాబు అభిప్రాయపడ్డారన్నారు. చౌకీదార్ అని చెప్పుకుంటూ అవినీతిపరులకు కొమ్ము కాస్తున్నారంటూ మోడీని విమర్శించిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు. 

మళ్లీ తెదేపా, భాజపా, జనసేన కలుస్తాయని జోస్యం చెప్పారు. రాజధాని పరిధిలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని ప్రజలెవరూ అధైర్యపడొద్దని రాయపాటి చెప్పారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు. కావాలంటే పులివెందులలో రాజధాని పెట్టుకోవాలని అంతేకానీ మూడు రాజధానులు తగదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి రాయపాటి హితవు పలికారు.

రాజధాని రైతులు చేపట్టిన పోరాటాన్ని ఆపొద్దని సూచించారు. శృతిమించుతున్న పోలీసులపై తిరగబడాలంటూ  ఆయన రాజధాని రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారు.  ఏపీ ప్రజల కోపం కాంగ్రెస్‌పై నుంచి బీజేపీపైకి మళ్లిందని అపోహపడ్డారన్నారు వస్తానికి విధజన సమయంలో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పార్లమెంట్‌లో 15 నిమిషాల్లోనే రాష్ట్ర విభజనను పూర్తి చేసింది. విభజన కూడా సక్రమంగా జరగలేదన్నారు. భావితరాల కోసం రాజధాని రైతులు పోరాడుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పులతో కొట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని దివ్యవాణి హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: