జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల సమయంలో జాతీయ పార్టీ బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అయితే తాజాగా మాత్రం భారతీయ జనతా పార్టీ తో కలసి పనిచేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా పడిపోయిన పవన్ కళ్యాణ్ ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నేతలతో పాటు బిజెపి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా తో భేటీ కావాలని ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బిజెపి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై మాట్లాడినట్లు..అదేవిధంగా భవిష్యత్తులో బిజెపి పార్టీ తో కలిసి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 

ఈ క్రమంలో నడ్డా మాత్రం ఈ అంశంపై ఏపీ బీజేపీ ఇంచార్జ్‌లతో చర్చలు జరపాలని పవన్‌కు సూచించారు. నడ్డా సూచనతో పవన్‌ ఏపీ బీజేపీ ఇంచార్జ్‌లు మురళీధరన్‌, సునీల్‌ దేవధర్‌లతో చర్చలు జరిపారు. ఈ భేటీలో పొత్తుపై బీజేపీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. పొత్తులపైన ఆలోచిస్తామనే ధోరణిలోనే బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో పాచిపోయిన లడ్డులు ఇచ్చారంటూ బీజేపీపై పవన్‌ తీవ్రంగా దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బాటలో నడిచిన పవన్‌ బీజేపీపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీ కలసి పని చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయినట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి మరియు జనసేన పార్టీలు కలిసి పని చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

అయితే ఇదంతా చంద్రబాబు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని...చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిజెపి పార్టీ ని తీవ్రస్థాయిలో విమర్శించి...తన రాజకీయ లబ్దికోసం గత ఎన్నికల ఈ సమయంలో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి లో పనిచేసి తర్వాత ఏపీ లో ఓటమిపాలై బిజెపి పార్టీ పెద్దల ముందు నవ్వుల పాలు కావడంతో..చంద్రబాబు ని చీ కొట్టిన బిజేపి పార్టీతో పవన్ కళ్యాణ్ చేత మంతనాలు జరిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న జగన్ ని రాజకీయంగా ఇబ్బందుల పాలు చేసి పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని తాజాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: