రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైంది. అనేకమంది ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళు తమ సొంత గ్రామాలకు సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి రావటానికి టోల్ ప్లాజా వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్ కూడా సంక్రాంతి పండుగ చేసుకోవడానికి రెడీ అయ్యారు. గుడివాడలో జరగబోయే సంక్రాంతి వేడుకల్లో మంత్రి కొడాలి నాని తో కలిసి సీఎం జగన్ పాల్గొంటున్నారు.  ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఏర్పాట్లకు సంబంధించి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు.

 

అయితే ప్రతి ఏటా జరిగే విధంగానే ఎడ్ల పందాలు మరియు గొర్రె పొట్టేలు పందాలు అదేవిధంగా ముగ్గుల పోటీలు హరిదాసులు గంగిరెద్దులు మరియు భోగి మంటలు ఇవన్నీ నిర్వహించనున్నట్లు మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని గుడివాడ ప్రజలు కూడా జగన్ రాక కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నట్లు కొడాలి నాని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పండుగకు రావాలని అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం జగన్ ని కొడాలి నాని కోరినట్లు ఆ తరువాత కూడా గుర్తు చేయడంతో సీఎం జగన్ ఒప్పుకున్నట్లు 14 వ తారీకు భోగి రోజు సందర్భంగా సంక్రాంతి పండుగలో సీఎం జగన్ పాల్గొననున్నట్లు మంత్రి కొడాలి నాని మీడియాకు చెప్పారు.

 

ముఖ్యమంత్రి పర్యటన ఉండనుండటంతో గుడివాడలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఏర్పాట్లను సమీక్షించారు. ప్రస్తుతం సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయి విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కు సంబంధించిన అనేక అంశాలను సామరస్య వాతావరణంలో చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాగు మరియు సాగు నీటి సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: