ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువ అయిపోయాయి. ఆలా అయిపోయిన సంగతి కూడా మీకు తెలిసిందే. అయితే ఆ కొరియర్ సంగతి ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి బాబు.. ఓ ఐటి ఉద్యోగిని కొరియర్ కోసం ఏకంగా 63,900 రూపాయిలు కోల్పోయింది. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని కొరియర్‌ పంపిస్తామంటూ చెప్పిన వ్యక్తి మాటలు విని మోసపోయింది. ఆ వ్యక్తి ఆమె గూగుల్‌ పే ఖాతా నుంచి ఏకంగా రూ.63,900 కాజేశాడు. ఆ ఉద్యోగి భర్త కెనడాలో ఉంటున్నడు, అందుకే తన భర్తకు ఫెడెక్స్‌లో కొరియర్‌ పంపాలనుకుంది.

 

ఈ మేరకు ఆమె గూగుల్‌ సెర్చ్‌లో సదరు సంస్థ ఫోన్‌ నంబర్‌ కోసం వెదికింది. అయితే ఆ ఫోన్‌ నంబర్‌ నకిలీది. కానీ ఆ విషయం ఆమెకు తెలియకపోవడంతో ఆ నంబర్‌కు ఆమె కాల్‌ చేయగానే అవతల ఉన్న వ్యక్తి తాను ఫెడెక్స్‌ ఉద్యోగినని, కొరియర్‌ పంపుతానని చెప్పి ఆమెకు ఓ వెబ్‌సైట్‌ లింక్‌ను మెసేజ్‌ చేశాడు. దాన్ని క్లిక్‌ చేసి అనంతరం వచ్చే లింక్‌లో కొరియర్‌ పంపేందుకు పేమెంట్‌ చేయమని అతను ఆమెకు చెప్పాడు. 

 

అయితే ఆమె ఆ లింక్‌ను ఓపెన్‌ చేయగానే అది ఆమె ఫోన్‌లో ఉన్న గూగుల్‌ పే యాప్‌కు రీడైరెక్ట్‌ అయింది. దీంతో ఆమె బ్యాంకు ఖాతా నుండి నాలుగు అయుదు సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మొత్తం రూ.63,900 నగదు ఆ వ్యక్తి అకౌంట్ కు ట్రాన్స్‌ఫర్‌ అయింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందుకే గూగుల్ లో నెంబర్లు తీసుకొని ఇలా డబ్బులతో చెలగాటం వాడకూడదు.. తెలిసి చేసిన తెలియక చేసిన మనం కస్టపడి సంపాదించినా డబ్బు అంత సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: