ఈ మధ్య కాలంలో చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు లేదా ఉన్న ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆధార్ కార్డులో వేరే అడ్రస్ ఉండటంతో అక్కడ ఆ కార్డును ఉపయోగించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆధార్ కార్డులో అడ్రస్ ను సులభంగా మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో అడ్రస్ ను మార్చుకోవటానికి ఆధార్ సేవా కేంద్రానికి, ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. 
 
ఎవరి సహాయం అవసరం లేకుండా సులభంగా ఆధార్ కార్డులో అడ్రస్ ను ఆన్ లైన్ లో సులభంగా మార్చుకోవచ్చు. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ లో అడ్రస్ ను మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది. మనం ప్రస్తుతం నివశిస్తున్న అడ్రస్ ను ఆధార్ కార్డులో సులభంగా అప్ డేట్ చేయవచ్చు. కానీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలంటే ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ రిజిష్టర్ అయి ఉండాలి. 
 
ఆన్ లైన్ ద్వారా అడ్రస్ ను మార్చుకోవాలని అనుకునేవారు http://uidai.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసి my aadhaar అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తరువాత update your aadhaar అనే సెక్షన్ లో update your address online అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత proceed to update address అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆధార్ కార్డు నంబర్ ను, కాప్చా కోడ్ ను ఎంటర్ చేసి మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఆడ్రస్ ఫ్రూప్ అప్ లోడ్ చేసి అన్ లైన్ లో అడ్రస్ ను మార్చుకోవచ్చు. 
 
అడ్రస్ ప్రూఫ్ లేనివారు address validation letter అనే ఆప్షన్ ను క్లిక్ చేసి అందులో ఉండే నాలుగు స్టెప్స్ ను కంప్లీట్ చేసి ఆధార్ కార్డు అడ్రస్ ను మార్చుకోవచ్చు. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో అడ్రస్ మార్చుకోవాలనుకునేవారు ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకొని సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి అడ్రస్ మార్చుకోవచ్చు. ఈ విధంగా సులువుగా ఆధార్ కార్డులోని అడ్రస్ ను మార్చుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: