వస్తాడు మారాజు ఈ రోజు అంటూ కాకుండా జనసేన పార్టీ కార్యకర్తలు ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే పవన్ వచ్చేది ఏ భోగి మంట దగ్గరో చలి కాగడానికి కాదు సుమా ! కొద్దీ రోజుల క్రితం చెలరిగిన ఓ వివాదాన్ని మరింత రాజేసేందుకు. 

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలో నుంచి లేచి అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లిన పవన్ రెండు రోజుల పాటు ఢిల్లీ లోనే ఉండిపోయారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకోబోతున్న పవన్ ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్తారు. రెండు రోజుల క్రితం కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించి, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది. 


ఆ తరువాత  పార్టీ కీలక నాయకులతో సమావేశం నిర్వహించి ఢిల్లీ పొలిటికల్ అప్డేట్స్ వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కాకినాడ పర్యటనపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది. కాకినాడ సిటీ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కొద్దీ రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆదివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి దగ్గర జనసేన కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులకు జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ రాళ్లదాడి జరగగా ఆ ఘటనలో కొంతమంది జనసేన కార్యకర్తలు గాయాలపాలయ్యారు.దీనిపై పోలీసులు జనసేన నాయకులపై కేసు నమ్మొడు చేయగా దీనిపై పవన్ ఢిల్లీ నుంచి స్పందించి వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

కాకినాడ వచ్చి తాను తాడో పేడో తేల్చుకుంటాను అంటూ ఆయన ప్రకటించారు. దీంతో పోలీసులు కాస్త సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ ఈ రోజు కాకినాడ రావడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికే అమరావతి విషయంలో  పవన్ వైసీపీ ప్రభుత్వంపై కొద్ది రోజుల పాటు విమర్శలు చేస్తూ హడావుడి చేశారు. ఇప్పుడు అదే విధంగా హడావుడి చేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నారా అనేది తేలాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: