లపై జరిగిన దాడిని సుమోటోగా తీసుకున్న హైకోర్టు   , రాష్ట్రంలో రాక్షసరాజ్యం నడుస్తోందని, పాశవికంగా దాడిచేయడమేంటని ప్రభుత్వాన్ని  ప్రశ్నించిందని, జరిగినదానిపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించిందని, న్యాయస్థానం వ్యాఖ్యలు రాష్ట్రానికి చెంపపెట్టని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.
 
రాజధాని ఉద్యమంకోసం రైతులు, మహిళలు, కూలీలు చనిపోయినా, ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతల్లో కనీసస్పందన లేదని, పిచ్చోడికి, వెర్రివెంగళప్పకు అధికారమి వ్వడంద్వారా ఇదంతా ప్రజలుచేసుకున్న దురదృష్టమని ఉమా మండిపడ్డారు. తన, తన సహచరుల రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాభివృద్ధికోసమే, జగన్‌ విశాఖజపం చేస్తున్నాడన్నా రు. పక్కరాష్ట్రాల్లో స్వరాష్ట్రంగురించి చులకనగా మాట్లాడుతున్నా, ఆంధ్రులను అవమా నిస్తున్నా జగన్‌లో చలనం లేదన్నారు. 
 
 
 
జీ.ఎన్‌.రావు, బీ.సీ.జీ కమిటీలుపోయాయని,  ఇప్పుడు పవర్‌లేని హైపవర్‌కమిటీ ఏం చేస్తుందన్నారు. కమిటీలు చెప్పాల్సిందాన్ని ముఖ్యమంత్రి ముందే శాసనసభలో చెప్పాడని, దానికి అనుగుణంగానే అజయ్‌కల్లం ఆదేశాలప్రకారం ఆయా కమిటీలు రిపోర్టులు ఇచ్చాయన్నారు. అమరావతిని చంపడాని కి ముఖ్యమంత్రి ఇప్పటివరకు 5కమిటీలు వేశాడని, 34వేలఎకరాలు, రూ.10వేలకోట్ల నిర్మాణాలు, రాజధాని వెలుపల రూ.10వేలకోట్లకు పైగా జరిగిననిర్మాణాలు ఆయనకు కనిపించడంలేదన్నారు. రాష్ట్ర జీడీపీ రూ.9లక్షల20వేలకోట్ల జీడీపీలో విశాఖపట్నం జీడీపీ రూ.2లక్షల30వేలకోట్లని, అలాంటి నగరాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన పనిలేదన్నారు. 
 
 
 
జగన్‌నిర్ణయంతో రాజధానికి భూములిచ్చామని అమరావతి రైతులు ఏడుస్తుంటే, తమ భూములు లాక్కుంటారని విశాఖవాసులు ఏడుస్తున్నారని ఉమా దెప్పిపొడిచారు. గత ఏడునెలల్లో విజయసాయి ఆధ్వర్యంలో విశాఖచుట్టుపక్కల 52వేల ఎకరాలు చేతులు మారాయన్నారు. బయటిరాష్ట్రాల నాయకులుకూడా జగన్‌కనుసన్నల్లో విశాఖలో భూములుకొన్నారని, వాటిలావాదేవీలకోసమే జగన్మోహన్‌రెడ్డి కీలుబొమ్మలా మారాడని, 23వతేదీకల్లా విశాఖవెళ్లేలా ఇప్పటికే తట్టాబుట్టా సర్దేశాడన్నారు. జే.ఏ.సీ ఆధ్యర్యంలో రేపు భోగిమంటల్లో జీ.ఎన్‌.రావు, బీ.సీ.జీ, ఇతరకమిటీలిచ్చిన బోగస్‌  నివేదికలను తగులబెట్టాలని, రాష్ట్రమంతా నిరసనప్రదర్శనలు నిర్వహించాలని ఉమా పిలుపునిచ్చారు.జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌తో ఏఏ అంశాలు, సమస్యలపై చర్చించాడో మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌ సమక్షంలో చెప్పే దమ్ము,ధైర్యం జగన్‌కున్నాయా అని దేవి నేని సవాల్‌విసిరారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: