జగన్‌ ఆనందంకోసం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాడుతున్న భాషని చూసి సభ్యసమాజం సిగ్గుపడుతోందని,  వారుచేస్తున్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పైశాచికానందం పొందుతున్నాడని ఉమా మండిపడ్డారు. హైకోర్టు వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం పోలీస్‌బలగాల్ని ఉపసంహరించుకొ ని, రైతులు, జే.ఏ.సీనేతలు చేస్తున్న శాంతియుత ధర్నాలకు అనుమతివ్వాలన్నారు.   ఎక్కడ మహిళలు బయటకువస్తే, అక్కడ సెక్షన్లు 144, 30 అమలుచేస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏంచేసినా వారికే సెక్షన్లు వర్తించవన్నారు.

 

జగన్‌, కేసీఆర్‌లు ఇప్పటివరకు 6సార్లు భేటీ అయ్యారని, ఏప్రయోజనాలకోసం, ఏఅంశాలకోసం చర్చలు జరిపారో ఒక్కసారికూడా జగన్‌ వివరణ ఇవ్వలేదన్నారు. రెండురాష్ట్రాలమధ్య రూ.లక్షా97వేలకోట్ల ఆస్తుల పంపకాలు జరగాల్సిఉందని, షెడ్యూల్‌ 9, 10 కింద అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ ఆస్తులకి సంబంధించి రూ.5,500కోట్లు పంపకాలు జరగాల్సి ఉందని, ఏపీజెన్‌కోకు  తెలంగాణ డిస్కంలనుంచి రూ.5,700కోట్లు రావాల్సిఉందని, వేలాదిఉద్యోగుల సమస్య అలానే ఉందని, దానికి సంబంధించిన కోర్టుఉత్తర్వులు అమల్లోకి రాలేదన్నారు.

 

ఇన్ని సమస్యలుంటే, అధికారులులేకుండా జగన్మోహన్‌రెడ్డి ఏకాంతచర్చలకు వెళ్లడమేం టని ఉమా నిలదీశారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని తన వందలఎకరాల సెటిల్‌మెంట్‌ కోసం వెళ్లాడో, తన అనుమాయుల కంపెనీల్లో తనకున్న వాటాలపై చర్చించడానికి వెళ్లాడో జగనే సమాధానం చెప్పాలన్నారు. పాము తనపిల్లల్నితానే తిన్నట్లుగా,  పక్క రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధికోసం ఈరాష్ట్ర ముఖ్యమంత్రి పాటుపడటం సిగ్గుచేట న్నారు. 5కోట్లమంది నమ్మకాన్ని వమ్ముచేసిన జగన్మోహన్‌రెడ్డి, హైదరాబాద్‌ అభివృద్దికి సహకరిస్తూ, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడని ఉమా దుయ్యబట్టారు.  

 

అమరావతి అనేది ఒకస్ఫూర్తని, 5కోట్లమందికి ప్రతీకని, అలాంటి రాజధానిని మూడు రాజధానుల ప్రకటనతో చంపేశారని, పోలవరాన్ని పండబెట్టి, కేసీఆర్‌తో ఏకాంతచర్చలు జరపడం జగన్మోహన్‌రెడ్డికే చెల్లిందన్నారు. వెన్నెముకలేని మంత్రులు కోటలోఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని, వారికి పౌరషం, బాధ్యత లేవన్నారు. 151మంది ఎమ్మెల్యేలు తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్నారన్నారు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ సహా, 9నగరాల అమరావతి నిర్మాణానికి రైతులు తమభూములు త్యాగం చేశారనే  విషయాన్ని మరిచిన మంత్రులు ప్లాట్లు ఇస్తాం.. భూములిస్తాం.. డబ్బులిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో సాగిన భూములదందా, 23వ తేదీనుంచి విశాఖకేంద్రంగా కొనసాగుతుందని ఉమా స్పష్టంచేశారు. జగన్‌ ఆలోచనలు ముఖ్యమంత్రిస్థాయిలో లేవని, అందువల్లే ప్రజలకు ఇన్ని సమస్యలన్నారు.  గుడివాడలో జరుగుతున్న కోతముక్క, కోడిపందాలు, మూడుముక్కలాటను చూడటానికి వెళుతున్న జగన్మోహన్‌రెడ్డి, ఇళ్లపట్టాలివ్వడానికి వెళుతున్నట్లు చెబుతున్నాడన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: