ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంది.  రెండున్నర రోజుల పాటు  ఢిల్లీలో కూర్చున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరకు పొత్తులు పెట్టుకోవటానికి బిజెపి ముందు  ప్రతిపాదన పెట్టి తిరిగి రాష్ట్రానికి వచ్చేశారు. అమిత్ షా తో కలుద్దామని అనుకుంటే కుదరలేదు. సరే ప్రధానమంత్రి నరేంద్రమోడి అపాయిట్మెంట్ సంగతి సరేసరి. చివరకు మొదటి రెండు రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా దర్శన భాగ్యం కూడా దక్కలేదు.

 

అసలు ఢిల్లీకి పవన్ ఎందుకొచ్చాడో కూడా తెలీని పరిస్దితుల్లో రెండు రోజుల పాటు ఖాళీగా కూర్చున్నారు.  మొత్తానిని ఏదో అవస్తలు పడితే చివరకు నడ్డా అపాయిట్మెంట్ దొరికింది.  దానికే సంబరపడిపోయిన పవన్ రాష్ట్రంలో పరిస్దితి వివరించారట. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద రిపోర్టునే సమర్పించారు. అలాగే జగన్ అరాచకాలను అడ్డుకోవటానికి రెండు పార్టీలు కలిసి పోటి చేయాల్సిన అవసరాన్ని వివరించారట.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ నుండి పొత్తు ప్రతిపాదనలు లేకపోతే విలీనం అనుకోండి అంతా విన్న తర్వాత తనకు కూడా సమాచారం ఉందని చెప్పారట. పవన్ ప్రతిపాదన విషయాన్ని ప్రధానమంత్రి, అమిత్ షా లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని నమస్కారం పెట్టి పంపించేశారు.  చివరకు పవన్ కు ఎంతటి దుర్గతి పట్టిందో  అందరికీ అర్ధమైపోతోంది.

 

జగన్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో భూకంపాలు పుట్టిస్తానని, సునామీ సృష్టిస్తానంటూ ఆమధ్య ఏవేవో చెప్పిన విషయం అందరూ చూసే ఉంటారు. తీరా చూస్తే జగన్ దెబ్బకు పవన్ కుదేలైపోయినట్లు అర్ధమైపోతోంది. చూస్తుంటే జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయటంలో  చంద్రబాబునాయుడు కూడా తేలిపోయినట్లు పవన్ కు అనుమానం వచ్చినట్లుంది. అందుకనే వేరే దారిలేక బిజెపితో పొత్తులు తప్పదని నిర్ణయమైనట్లుంది. అందుకే బిజెపి ముందు సాగిలపడ్డారు.  జరిగిన పరిణామంతో పవన్ తనంతట తానుగా బిజెపి చేతిలో ఇరుక్కుపోయినట్లే అనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: