సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయానికి నిలువుటద్దంల మరి పండుగనే కాదు... ఎంజాయ్ మెంట్ కి మరో పేరు అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఈ పండుగను మూడు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకుంటారో.. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలతో అంతే హోరెత్తిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది కోడిపందాలు. మిగతా వేటినైనా మిస్ అవ్వడానికి ఇష్టపడుతుంటారు కానీ కోడిపందాలు  మాత్రం ప్రజలు మిస్ అవ్వరు . ఎన్ని పనులున్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కోడి పందేలను చూడడానికి మాత్రం వచ్చేస్తారు. కోడి పందేల్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు పాల్గొంటారు. 

 

 

 కోడిపందాలు జరుగుతున్న సమయంలో బరిలో దిగిన పందెం కోళ్ళపై పందెం కాసి లక్షలకు లక్షలు పోగొట్టుకున్న వారు కొందరైతే.. లక్షలకు లక్షలు గెలుచుకున్న వారు ఇంకొందరు. ఇకపోతే కోడిపందాలు బరిలోకి దిగే పందెం కోళ్లకు ఎంత డిమాండ్  ఉంటుందో తెలిసిన విషయమే. కోడిపందాలు వస్తున్నాయి అంటే కొన్ని నెలల నుంచి కోడి పుంజులను సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పందెం కోళ్లను సిద్ధం చేసేందుకు వ్యాపారంగా కూడా మార్చుకుంటారు. కొన్ని పందెం కోళ్లను పెంచి వాటిని ఎక్కువ ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇంకొంత మందైతే పందెం కోళ్లను కన్న కొడుకు లాగా కూడా చూసుకుంటారు. అబ్బో తమా  కొడుకైన అంత మంచి ఫుడ్ పెడతారో లేదో కానీ... పందెం కోళ్లకు మాత్రం నాణ్యమైన బలమైన ఆహారం పెడతారు. 

 

 

 

 పందెం కోళ్ల మెనూ  చూస్తే అవ్వకవుతారు  చాలామంది. పందెం కోడికి ఫుడ్ మెనూ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. రోజు ధాన్యం,  చోళ్లు గంటెలు,  కోడి గుడ్డు తో పాటు రెండు రోజులకొకసారి మటన్ కీమా పెడతారు. అలాగే బాదం పిస్తా లాంటి దాదాపు 20 రకాల డ్రై ఫ్రూట్స్ కూడా పెడతారు. ఇవి కాకుండా ఇంకా చాలా ఆహారం పందెం కోళ్లకు అందిస్తూ వుంటారు. కానీ ఎవరు మాత్రం బయటకు ఈ విషయాన్ని చెప్పారు... ఎందుకంటే బరిలోకి దిగితే తమ  పందెం కోడి మాత్రమే గెలవాలి.. ఈ విషయాలన్నీ బయటకు చెబితే విజయం  మంత్రం వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిపోతుంది కదా. అయితే పందెం కోళ్ళు ఖరీదు పది వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉంటుంది, కానీ కోళ్లపై బెట్టింగ్ మాత్రం 15 నుంచి 20 లక్షల దాకా చేస్తారు. కోడి పందాలు నిర్వహిస్తున్న సమయంలో భారీ బిజినెస్ జరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: