ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ఒకపక్క తెలంగాణలో సీఎం కుర్చీ ని కేటీఆర్ కు ఇచ్చేద్దాం అని కెసిఆర్ ఆలోచిస్తుండగా మరొక పక్క మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని జగన్ ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపారు. ఇటువంటి సమయంలో సంక్రాంతికి కేసీఆర్ మరియు జగన్ మధ్య నిన్న జరిగిన మీటింగ్ రాజకీయంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించుకున్న వీరు ముఖ్యంగా రాష్ట్ర విభజన  సమయంలో నిలిచిపోయిన నా కొన్ని కీలకమైన అంశాలు గురించి చర్చించుకున్నారు.

 

ఇంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన మీటింగ్ లో గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించే విధంగా  తగు చర్యలు మరియు వాటి రెండిటి అనుసంధానం జరిగే ప్రదేశం ఏది అని చర్చించుకోగా.... నిన్న మీటింగ్ లో అదే పనిని తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో ఎలా జరిపించాలి అని మాట్లాడుకున్నారు. తర్వాత కొంత మంది పోలీస్ ఆఫీసర్ ప్రమోషన్లు మరియు ట్రాన్స్ఫర్ గురించి చి మాట్లాడుకున్న వీరిద్దరూ విభజన చట్టం కింద 9 మరియు 1షెడ్యూల్ లోని కొన్ని కీలకమైన అంశాలను వెంటనే పరిశీలనకు తీసుకొని రావాలని నిర్ణయించుకున్నారు.

 

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే తాటిపై నడవాలని నిర్ణయించుకోగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో రెండు రాష్ట్రాల్లో అభివృద్ధిని జరిపించాలని.... నిన్నటి మీటింగ్ లో ముఖ్య అంశంగా పేర్కొన్నారు. అలాగే అదీ కాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ విభజన చట్టంలోని అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు నిర్ణయించుకున్నారు. అయితే జగన్ మూడు రాష్ట్రాల నిర్ణయం పై కేసీఆర్ ఇంకా స్పందించాల్సి ఉండగా జగన్ కూడా కెసిఆర్ అభిప్రాయాన్ని మీడియా ముందు ఇంకా చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: