సమాజంలో జీవిస్తున్న కొందరి జీవన విధానం లో ఉన్న పలు లోపాలు అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. ఉన్నతమైన స్దానాల్లో ఉన్న వారి ఆకారం నుంచి ఆలోచనా విధానం వరకు ప్రతిదాంట్లోనూ విభిన్నతలు సృష్టంగా కనిపిస్తున్నాయి.. బరితెగించిన కొందరికైతే సమాజం, చట్టం, సామాజిక, మానసిక బంధాల పట్ల ఏమాత్రం గౌరవంలేదు. వీరి ఆలోచనాతీరే వికృతంగా ఉంది. ఇందుకు ఉదాహరణలుగా ఈ మధ్యకాలంలో యూనివర్శిటీ ల్లో జరుగుతున్న దారుణాలను చెప్పుకోవచ్చూ.

 

 

ఒక చోట అని ఏం లేదు. అన్ని యూనివర్శిటీల్లోని విద్యార్ధినులపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. చదుపులు చెప్పే వారు, చవటల్లా మారి చౌకబారు పనులు చేస్తున్నారు. ఇక ఇలాంటి ఘటన తమిళనాడు... సేలం దగ్గర్లోని పెరియార్ యూనివర్శిటీలో జరిగింది.. ఈ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చదువుతున్న నివేదిత అనే స్టూడెంట్ సోమవారం సాయంత్రం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అది చూసిన తోటి విద్యార్ధినిలు లోపలికి వెళ్లి చూడగా అప్పటికే నివేదిత చనిపోయి కనిపించింది.

 

 

ఇక ఈ ఘటన సవాల్ గా స్వీకరించిన విచారణ చేపట్టిన పోలీసులకు తెలిసిన విషయం ఏంటంటే. ఆమె చనిపోవడానికి కారణం... యూనివర్శిటీలో వేధింపులే అని తేలింది. అంతే కాకుండా ఈ పాపంలో బోటనీ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఓ ప్రొఫెసర్ హస్తం ఉందనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.. ఇకపోతే విద్యార్ధులను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న ఆ ప్రొఫెసర్ మంచివాడు కాదనీ విద్యార్థినులు అంటున్నారు. అందువల్ల పోలీసులు వెంటనే ఆ ప్రొఫెసర్‌ని అరెస్టు చెయ్యాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

 

 

ఐతే... స్టూడెంట్స్‌కి సర్ది చెప్పిన పోలీసులు... నివేదిత డెడ్ బాడీని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇలాంటి ఘటనలు చాలా కాలేజీలు, యూనివర్శిటీల్లో జరుగుతున్నాయి. మార్కులు, గ్రేడ్స్ మంచిగా కావాలంటే... తాము చెప్పినట్లు చెయ్యాలని కొంతమంది ప్రొఫెసర్లూ, లెక్చరర్లూ వెధవ్వేషాలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నివేదిత సూసైడ్ కలకలం రేపుతోంది.

 

 

ఇక అంతవరకు కష్టపడి చదివి ఉన్నతమైన చదువుల కోసం యూనివర్శిటీల్లో చేరి తమ ప్రాణాలు తీసుకుంటున్న ఇలాంటి అమ్మాయిలను చూస్తే ఈ చదువులు మాకు వద్దు అనే పరిస్దితులు ముందు ముందు తలెత్తుతాయంటున్నారు సమాజంలోని కొందరు వ్యక్తులు..

మరింత సమాచారం తెలుసుకోండి: