ఈ రోజుల్లో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది క్షణికావేశంలో ప్రాణాలు తీయడం ప్రాణాలు తీసుకోవడం చేస్తున్నారు. ఇక ఒక్కసారి ప్రాణాలు తీసుకున్నాక ఆ తరువాత పశ్చాత్తాప పడటానికి  బతికి ఉండము  కదా. ఇలాంటి ఘటనలు రోజు కోటి జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. టీవీ  విషయంలో జరిగిన చిన్న గొడవ. ఓ యువతి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే... సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఓ విద్యార్థిని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.

 

 

 హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను జరుపుకునే సంతోషంగా గడపాలని వచ్చింది. కానీ సంక్రాంతి పండుగకు కుటుంబం మొత్తం సిద్ధం అవుతున్న వేళ ఆ కుటుంబంలో తీరని విషాదం నిండిపోయింది. భాగ్యలక్ష్మి అనే 19 ఏళ్ల యువతి జనగామలో ని వసతి  గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది. సంక్రాంతి సెలవులు రావడంతో హాస్టల్ నుండి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని వచ్చింది. 

 

 

 అయితే ఆదివారం నాడు అక్క చెల్లెల్లు ఇద్దరు టీవీ చూస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్క... ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు ఆ యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పండుగ పూట ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపడానికి వచ్చిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో.. మా ఊరిలో విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు దూరమైందని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: