కాకినాడలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి.  అమరావతి రగడ చాపకింద నీరులా పాకుతున్నది.  మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రగులుకుంటుందా అంటే ప్రస్తుతానికి పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి.  కొన్ని ప్రాంతాల వ్యక్తులు రాజధానిని మార్చేందుకు ఒప్పుడుకోవడం లేదు.  ఈరోజు కేవలం కార్యనిర్వాహక రాజధానిని మాత్రమే అని చెప్పి మారుస్తారు.  తరువాత ఇక్కడికి అక్కడికి తిరగాలంటే ఇబ్బంది అవుతుంది.  కాబట్టి ఒకే చోటకు మారుస్తామని మార్చేస్తారు. 


దీంతో అమరావతి ప్రాంతం వైకాపా నేతలు చెప్పినట్టుగా ఎడారిగా మారిపోతుంది.  అసలు మొదట అమరావతి ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోకపోయి ఉంటె ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు కదా.  మరి ఇప్పుడు ఎందుకు ఇంతలా ఇబ్బంది పెట్టడం చెప్పండి.  గత నెల రోజులుగా అలజడులు జరుగుతూనే ఉన్నాయి.  ఈ అలజడులు ఎప్పుడు పూర్తవుతాయి అనే విషయం ఎవరూ చెప్పలేని పరిస్థితి.  


ఎందుకంటే, రోజు రోజుకు పరిస్థితుల స్థితిగతులు మారిపోతున్నాయి.  ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాస్త అగ్నిగా మారిపోతున్నది.  ఈ పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా ఇలా లేవు.  సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం గతంలో ఆంధ్రా ప్రాంతం మొత్తం ఫైట్ చేసింది.  అది వెళ్ళిపోయింది.  ఇప్పుడు రాజధాని విషయంలో గొడవ జరుగుతున్నది. 1953 నుంచి ఇదే తంతు. ఎప్పుడైతే మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అప్పటి నుంచే ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  


ఆంధ్రప్రదేశ్ కు సపరేట్ గా ఒక రాజధాని లేకపోవడం దౌర్భాగ్యం అని చెప్పాలి.  1953 లో ఒక రాజధాని ఉన్నది.  ఆ తరువాత మరొక రాజధాని. 2014 నుంచి 2019 వరకు మరొక రాజధాని.  ఇప్పుడు అసలు రాజధాని ఏంటో తెలియని పరిస్థితి.  నిజంగానే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని శాపం అనుకుంటా.  అందుకే రాజధాని స్థిరంగా ఉండటం లేదు.  ఈసారైనా ఒకచోట ఉంటుందో లేదంటే అక్కడికి ఇక్కడికి తిరుగుతుందో చూడాలి.  దేశంలో స్థిరమైన రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుందేమో చూద్దాం.  ఇక ఇదిలా ఉంటె, ఈరోజు పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తున్నారు.  దీంతో అక్కడ 144, సెక్షన్ 30 ని విధించారు.  జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టడంతో పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తున్నారు.  పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తుండటంతో జనసేన కార్యకర్తలు కాకినాడ తరలి వస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉండటంతో కాకినాడలో పోలీసులు భారీగా మోహరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: