ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిదంగా సరికొత్త పథకాలకు ఊపిరి పోశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ అధికారంలోకి వస్తే రాజన్న పాలన మరోసారి వస్తుంది అని నమ్మిన ప్రజలకు అంతకుమించిన పాలనే అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ఎన్నికల్లో ఇవ్వని  హామీలను కూడా ప్రజలకు అందజేస్తూ ఎంతో మంది ప్రజల మన్ననలు పొందుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు మెరుగైన విద్య వైద్యం  అందించడం పై ఎక్కువగా దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆరోగ్య శ్రీ పరిధిలోకి ఏకంగా రెండు వేల వ్యాధులను చేరుస్తూ పేద ప్రజలకు ఎంతో మెరుగైన వైద్యం అందించేందుకు నడుం బిగించారు. వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయిన ప్రతి ఒక్క వ్యాధికి ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చెన్నై బెంగళూరు హైదరాబాద్లోని పలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లలో  ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అనుసంధానం చేసి పేద ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తున్నారు. విష జ్వరాలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చి పేద ప్రజలకు మెరుగైన వైద్యం పొందేందుకు పైసా ఖర్చు కూడా లేకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 ఇక ఇప్పుడు తాజాగా ఆరోగ్యశ్రీలో మరిన్ని క్యాన్సర్ శస్త్రచికిత్సలు  చేర్చాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. మెడికల్ రేడియేషన్ సర్జికల్ ఆంకాలజిల లో కొత్త చికిత్సలు అందుబాటులోకి తీసుకు రాగా.. ఆయా చికిత్సలకు ప్యాకేజీ కూడా ఐదు శాతం పెంచింది. కాగా క్యాన్సర్ తో  బాధపడుతున్న పేద ప్రజలందరికీ ఏ పరిమితి లేకుండా వైద్యసేవలు అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో క్యాన్సర్ తో బాధపడే చికిత్స చేయించుకోలేని పేదప్రజలకు మరింత మేలు చేకూరినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: