నవ్యాంధ్రకు జరిగిన మొదటి ఎన్నికల్లో వైసీపి పార్టీ అప్పట్లో టిడిపి చేతిలో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎప్పటికపుడు ప్రజల్లో మమేకం అవుతూ పలు కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అదే సమయంలో కొన్ని వేల కిలోమీటర్లు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రం అంతా పాద యాత్ర నిర్వహించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజల మెప్పు పొందిన వైసిపి పార్టీ, అత్యధిక మెజారిటీతో 151 సీట్లతో అధికారాన్ని చేపట్టగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించారు. ఇక అక్కడి నుండి ప్రజలకు మేలైన పాలన అందిస్తున్న వైసిపి పార్టీ, ప్రజలతో పలు విధాలుగా మమేకం అవుతున్నారు. 

 

అలానే పలు పండుగలు వస్తున్న నేపథ్యంలో కొందరు నాయకులు ప్రజల్లోకి వెళ్లి పండుగలను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ఇది మొట్టమొదటి సంక్రాంతి కావడంతో కొన్ని ప్రాంతాల్లోని నాయకులు ప్రజలు ఎప్పటినుండో నిర్వహిస్తున్న కోడి పందాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అలానే పందాల నిర్వహణకు అనుమతుల కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ కొందరు తిరుగుతున్నారు. తరాలుగా వస్తున్న సంప్రదాయ క్రీడను కొనసాగించాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. ఇక వైసీపీ వాళ్లు వాటికి అనుమతులు ఇవ్వడంతో పాటు త‌మ కోళ్లు విజ‌యం సాధించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.


 
భారీ ఎత్తున ల‌క్ష‌లు వెచ్చించి మంచి జాతి కోళ్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా గోదావరి జిల్లాల్లో జరిగే ఈ కోళ్ల పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. అయితే ఇది కేవలం ప్రజలు ఏడాదికి ఒకసారి మాత్రమే సరదాగా జరుపుకునే ఒక సంప్రదాయ క్రీడ అని, అందుకే వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, అలానే ఎటువంటి గొడవలు జరుగని రీతిలో కోడి పందాలకు అనుమతులు ఇస్తున్నట్లు కొందరు నాయకులు చెప్తున్నారు. అలానే ఈ పోటీలో తమ కోళ్లను కూడా నిలుపుతూ పలువురు నాయకులు కూడా ప్రజల్లో ఒకరిగా మమేకం అవుతూ ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. ఇక వైసీపీ పార్టీ సానుభూతి ప‌రులు.. లేదా ఆ పార్టీ అభిమానులు త‌మ కోళ్ళే గెల‌వాల‌న్న క‌సితో పందాల్లోకి దిగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: