తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ పండుగైన భోగి రోజు వేకువ జామున వేసే భోగి మంటల్లో ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం మలమల కాలుతుంది. ప్రతిపక్షాలు తమ దుగ్ధను ఈ విధంగా తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో పండుగలకు పార్టీ రంగులు పులుముతున్నారు. మంగళవారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద భోగి మంట కార్యక్రమాన్ని టిడిపి నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జీస్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగానే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.

రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు ప్రాంతంలోని రైతులు ఉదయాన్నే భోగి మంటల్లో కమిటీ రిపోర్టులు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంజిసర్కిల్ లో జరిగిన కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అమరావతిని చీలిస్తే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే విధంగా భోగి పండగ సందర్భంగా ఉయ్యూరు పట్టణంలో ఏర్పాటు చేసిన భోగి మంటలలో రాష్ట్రంలో మూడు రాజధాని అంశంపై ఏర్పాటైన  బోస్టన్ కమిటీ, జి.యన్.రావు కమిటీల నివేదికలను  తగులబెట్టి నిరసన తెలియ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకత్వం వహిస్తున్నారు.


ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవాలను కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు అనుకూలంగా నివేదికలు ఇచ్చిన బోస్టన్ కమిటీ, జి.యన్.రావు కమిటీలను  రాజేంద్రప్రసాద్ తప్పు పట్టారు. ప్రజలు మధ్య ప్రాంతాల మధ్య, చిచ్చు పెట్టేలా ఈ నివేదికలు ఉన్నాయి అని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతిలొనే కొనసాగే వరకు, రైతులకు ఉద్యమకారులకు మద్దతుగా ఉంటామని రాజేంద్రప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో ఉయ్యూరు మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబ ఉయ్యూరు, జేఎసి సభ్యులు మిక్కిలినేని.రామా మోహనరావు , మహిళలు, యువకులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: