సంక్రాంతి పండుగ వచ్చేసింది. మూడు రోజులపాటు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి అన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. కాగా నేడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలు. భోగి పండుగ లో భాగంగా ఇంటి ముందు భోగి మంటలు వేసి పాత వస్తువులన్నింటిని అందులో వేసి అన్ని పీడలు తొలగిపోవాలంటు  దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాకుండా భోగి మంటల చుట్టూ చేరి ఆటలు పాటలు ఆడుతూ ఉంటారు.

 

 

 ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంబరాన్నంటేలా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రజలు అందరూ సంక్రాంతి పండుగను ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు మునుపు ఉన్నంత సందడి ఈ ఏడు సంక్రాంతి పండుగకు లేదు  కారణం... అమరావతి నుంచి రాజధాని తరలించవద్దని ఏకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు నిరసనలు ధర్నాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల పైకి చేరి నినాదాలు చేస్తూ ఉండటం. దీంతో 29 గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగను బహిష్కరించారు. ఇక తాజాగా నేడు భోగి పండుగ లో భాగంగా అమరావతి 29 గ్రామాల ప్రజలు వినూత్నంగా భోగి పండుగను జరుపుకుంటున్నారు. జగన్ 3 రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఈరోజు. 

 

 

 రాజధాని అధ్యయనం కోసం జగన్మోహన్ రెడ్డి  సర్కార్ నియమించిన జిఎన్  రావు, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలను భోగిమంటల్లో వేసి తమ నిరసనను తెలియజేశారు అమరావతి ప్రాంత రైతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ నినాదాలు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం తుళ్లూరు ప్రాంతంలోని రైతులు ఉదయాన్నే భోగిమంటల్లో రాజధాని అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన 2 కమిటీల రిపోర్టులు  వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంజి సర్కిల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అమరావతిని చీల్చితే రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: