బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని కట్టకుండా ఎగేస్తుండటంతో బ్యాంకు అలాంటి వారిపై దృష్టిపెట్టింది.  అంతేకాదు, ఏ బ్యాంక్ అయితే అధికమొత్తంలో లోన్స్ ను ఈస్ట్ బ్యాంకులను దివాళా తీసేలా చేస్తున్నాయో వాటిపై కూడా ఆర్బిఐ దృష్టి పెట్టింది.  గతంలో మహారాష్ట్రలోని పీఎంసీ బ్యాంకులో జరిగిన స్కాం కారణంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.  బ్యాంక్ కష్టమర్ల జీవితాలు బుగ్గిపాలయ్యాయి.  ఇలాంటి తప్పులు మరలా జరగకూడదు అని భావించిన ఆర్బీఐ, ఇలాంటి బ్యాంకులపై దృష్టి పెట్టింది.  


ఆర్బీఐ దృష్టిలోకి ఇప్పుడు మరో బ్యాంకు వచ్చి చేరింది.  అదే కర్ణాటకలోని శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్.  ఈ బ్యాంకులో అనేక అవకతవకలు ఉన్నాయని గుర్తించిన ఆర్బీఐ, ఆంక్షలు విధించింది.  ఇకపై ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని, రుణాలు ఇవ్వడంగాని, వాటిని రెన్యూవల్ చేయడంగాని చెయ్యొద్దని ఆదేశించింది.  ఇన్వెస్ట్మెంట్లు చేయడంగాని, రుణాలు, డిపాజిట్లు తీసుకోవద్దని ఆదేశించింది.  


దీంతో సహకార బ్యాంక్ షాక్ అయ్యింది.  ఆ బ్యాంక్ కంటే కూడా కష్టమర్లు అధికంగా షాక్ అయ్యారు.  దీనికి ఓ కారణం ఉన్నది.  ఇకపై ఆ బ్యాంకు కష్టమర్లు రోజుకు రూ. 35,000 కు మించి విత్ డ్రా చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.  దీంతో ఆ బ్యాంక్ కష్టమర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  అంతకు మించి తీసుకోవడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించింది.  దీంతో పాటుగా బ్యాంక్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోవడానికి కూడా వీలు లేదని చెప్పింది.  


ఆస్తులను ట్రాన్స్ఫర్ చేయడంగాని, విక్రయించడంగాని అప్పులు తీర్చేందుకు చెల్లింపులు వంటివి చెయ్యొద్దని కూడా ఆదేశించింది.  క్లుప్తంగా చెప్పాలి అంటే, బ్యాంక్ ఉంటుంది కానీ, పనిచేయదు.  కేవలం కష్టమర్లు మాత్రమే డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు.  అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.  బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి మెరుగుపడేంతవరకు కూడా ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: