సహజంగా లోపల జరిగేది వేరు..బయటకు వచ్చేది వేరు. బయటకు చెప్పని అంశాలే చర్చల్లో కీలక పాత్రలు పోషిస్తాయనే విషయం అందరకీ తెలిసిందే. ఆ ఇద్దరు సిఎంల మధ్య ఏ విషయంలో సర్దుబాటయ్యిందంట అన్న ఆసక్తి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి మంగళవారం నాటి భోగి మంటలు కూడా వేదిక కావడం గమనార్హం. విభజన సమస్యలతో పాటు ఏ సమస్యను అయినా ఇద్దరు సీఎంలు  సామరస్యంగా పరిష్కరించుకోవటాన్ని ఇరు రాష్ట్రాల ప్రజలకు, ప్రతిపక్షాలకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ  అవసరం లేకపోయినా అవమానించిన తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ‘సర్దుబాటు’కు కారణాలు ఏంటి అన్నదే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కూడా చర్చకు కారణం అవుతోంది.

ప్రధానంగా తెలుగు ముఖ్యమంత్రుల మధ్య అత్యంత కీలకమైన గోదావరి జలాల వినియోగ అంశంపై చర్చ జరిగినట్టు తెలుసుతుంది. ఓ వైపు ఏపీ సీఎం  జగన్మోహన్ రెడ్డి పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సుమారు అరవై వేల కోట్ల రూపాయలపైబడిన వ్యయంతో సమగ్ర ప్రాజెక్ట నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ఆదేశించారు. వాస్తవానికి దీనిని తెలంగాణతో సంబంధం లేకుండానే సొంతంగా చేపట్ట సంకల్పించారు. అందులో భాగంగానే   గోదావరి జలాల వినియోగ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే పలు సమీక్షలు కూడా నిర్వహించారు. కానీ సడన్ గా మళ్ళీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణతో కలసి ప్రాజెక్టు చేపట్టేందుకు చర్చలు ప్రారంభించినట్లు ప్రకటించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ అమలయ్యే పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఆర్టీసీ సమ్మె-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో కెసీఆర్ వైఖరి చూసిన తర్వాత కూడా సీఎం జగన్ మళ్ళీ తెలంగాణతో కలసి లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు కు చర్చలు ప్రారంభించటం ఏ మాత్రం సరికాదని వైసీపీకి చెందిన అమాత్యులు సైతం వ్యాఖ్యానించడం విశేషం. 
దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుల విషయంలో జగన్ ఏకపక్షంగా ముందుకెళితే రాజకీయంగా నష్టం చేస్తుందని వైకాపాకి చెందిన  ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. జగన్ సహజంగా తనకు.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించరనే పేరుంది. ఈ విషయం పార్టీలో అందరికీ తెలుసు.  ఆ సహజ వైఖరికి అనుగుణంగానే అత్యంత కీలకమైన ఆర్టీసీ విలీనాన్ని జగన్  ఎన్ని అవాంతరాలు ఎదురైనా పూర్తి చేశారన్నది జగమెరిగిన సత్యం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయ్యేదా..చచ్చేదా?’ అని తెలంగాణ సీఎం కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు తగిన సమాధానం చెప్పారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టులు చేసిన సూచనను కూడా ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదన్నది  స్పష్టమైంది. ఫలితంగా  ఈ జనవరి నుంచి ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏ విషయంలో సర్దుబాటు జరిగిందన్న అంశం చర్చనీయాంశమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: