చంద్రబాబునాయుడు పోరాటంపై జనసేన అధినేత పవన్ కల్యాన్ కు అనుమానం వచ్చేసిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వచ్చేస్తోంది.  తాజాగా ఢిల్లీకి వెళ్ళి బిజెపి నాయకత్వం ముందు పవన్ సాష్టాంగ నమస్కారం పడిపోవటంతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి బిజెపితో పొత్తు పెట్టుకోవటం మినహా వేరే దారి లేదని పవన్ నిర్ధారణకు రావటంతోనే కమలం కాళ్ళు పట్టుకున్నారా ?

 

జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడిన పవన్ ప్రభుత్వాన్ని కడిగేస్తానని, వాతలు పెట్టేస్తానంటూ చాలా సార్లు రంకెలేసిన విషయం అందరూ చూసిందే. ప్రజా ఉద్యమాన్ని నిర్మించి  జగన్ కున్న 151 ఎంఎల్ఏ బలాన్ని బద్దలు కొట్టేస్తానంటూ భీకర ప్రతిజ్ఞలు కూడా చేశారు. సరే తర్వాత కొద్ది కాలం చంద్రబాబునాయుడు అడుగుజాడల్లో నడిచారు. కాస్త ముందెనకల్లో చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి జగన్ కు వ్యతిరేకంగా చాలానే మాట్లాడారు.

 

అయితే ఇద్దరూ విడివిడిగా వచ్చినా, కలిసొచ్చినా జగన్ వీళ్ళని అసలు లెక్కలోకి కూడా తీసుకోలేదు. తాను అనుకున్న పనులను అనుకున్నట్లే చేసుకుపోతున్నారు.  దాంతో బహుశా పవన్ కు అనుమానం వచ్చేసినట్లుంది జగన్ ను ఆపేంత సీన్ తామిద్దరికీ లేదని. అందుకనే వేరేదారి లేక చివరకు బిజెపి ముందు సాగిలపడ్డారు. అంటే రాష్ట్రంలో తాము చేయలేని పనిని కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించాలన్న నిర్ణయానికి పవన్ వచ్చినట్లే అనిపిస్తోంది.

 

కీ లేదని. అందుకనే వేరేదారి లేక చివరకు బిజెపి ముందు సాగిలపడ్డారు. అంటే రాష్ట్రంలో తాము చేయలేని పనిని కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించాలన్న నిర్ణయానికి పవన్ వచ్చినట్లే అనిపిస్తోంది.

 

మరి అదే సమయంలో  జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబేమో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే. చంద్రబాబు ఎంతగా గొంతు చించుకుంటున్నా, ఎన్నిచోట్ల జోలె పడుతున్నా, చివరకు ఎల్లోమీడియా ఎంత జాకీలేసి లేపుతున్నా ఉపయోగం కనబడటం లేదు.  చంద్రబాబు పోరాటాలు చూసిన తర్వాత పవన్ కు అనుమానం వచ్చేసినట్లుంది. అందుకనే ఇక లాభం లేదనుకుని ఏకంగా ఢిల్లీకి వెళ్ళి బిజెపితో పొత్తు ప్రతిపాదన పెట్టారు. చూద్దాం కమలంపార్టీ ఏమంటుందో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: