ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రదేశాల్లో కోడి పందాల జోరు కొనసాగుతుంది.  ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా.. పందెం రాయుళ్లు తమ పని తాము చేసుకుంటూ పోతూనే ఉన్నారు.  ఇక కోళ్ల పందాల్లో కోట్ల లావాదేవాలు ఉంటనాయన్న విషయం తెలిసిందే.  ఇక  తమ యజమాని కోసం ఎంతకైనా తెగించి పోరాటం చేసి చివరికి ప్రాణాలు కోల్పోతాయి.. తర్వతా వాటిని మనుషులు గుట్టుకున్న మింగేస్తారు అది వేరే విషయం. మనదేశంలో, అందులోనూ తెలుగువారి సంస్కృతిలో కలివిడిగా కలిసిపోయిన కోళ్ళ పందాల మోజు తక్కువేమీకాదు.

 

పందాలు వేడుకలుగా జరుపుకొని గెలుపు ఓటములపై పందాలు కాసి ఆనందించడం, పనిలో పనిగా డబ్బు సంపాదించడం సంక్రాంతి పండుగ రోజులకు అదనపు ఆకర్షణ. కోడి పందాల్లో అనేకానేక పద్ధతులు, రకాలు, పోరాట రూపాలు, మోసాలూ ఉన్నాయి. కోడి పందెంల్లో రాజ్యాలు పోగొట్టుకున్నవారు.. పెద్ద పెద్ద యుద్దలు చేసిన వారు ఉన్నారు.  పల్నాటి యుద్దం గురించి తెలియనివారు ఉండరు.. రక్తం ఏరులై పారిన ఈ యుద్దానికి మూలం కేవలం కోడి పందాలు అంటే నమ్ముతారా..? నిజం కోడి పందాల్లో మోసం చేసిన మంగమ్మ తన శపథం నెరవేర్చుకుంటుంది.. బ్రహ్మనాయుడిపై కసి తీర్చుకోవడానికి ఆమె చేసిన కుట్రతో పల్నాటి యుద్ధం, ఆంధ్ర దేశం లోని పల్నాడు ప్రాంతములో 1182 వ సంవత్సరంలో జరిగింది.  ఇక పందెం కోళ్లకు ఇచ్చే ట్రైనింగ్ మామూలుగా ఉండదు.  

 

ఓ రేంజ్ ట్రైనింగ్ ఇచ్చి పందేలకు దింపుతుంటారు. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా స్పెషలిస్టుల ఆధ్వర్యంలో కోళ్లకు శిక్షణ ఇప్పిస్తుంటారు.  ఉభయగోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గత సంక్రాంతి నుంచే కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. పందెంగాళ్లు రైతు దగ్గర నుంచి మామూలు ధరకే కోడి పుంజులను కొనుగోలు చేస్తారు. వీటిని పందేలకు సిద్ధం చేయటంలో భాగంగా భారీ మొత్తంలో వెచ్చిస్తారు. కత్తి పందాలకు, డింకీ పందాలకు అనుగుణంగా కోళ్లను రెడీ చేస్తున్నారు. వీటిలో కత్తి పందాలకే పందెంరాయుళ్లు మొగ్గుచూపుతుంటారు.  ఏది ఏమైనా ఈ ఏడాది కూడా పందెం రాయుళ్లు మంచి జాతి కోడి పుంజులతో పందాలకు రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: