ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళు తమ గ్రామాలకు ఊర్లకు వచ్చి బంధువులతో తమ ఊరి వాళ్ళతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ ఆ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా రెండు గోదావరి జిల్లాల్లో కోడి పందేల ఆటలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు సకాలంలో బాగా పడటం అదేవిధంగా పంటలు కూడా బాగా పండటం తో రైతులు చాలా లాభాలు పొందటంతో ఈసారి సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.

 

ఇకపోతే కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని ప్రతియేటా నిర్వహించే విధంగానే ఈసారి కూడా తన నియోజకవర్గంలో ఎడ్ల పందేలను ఇంకా అనేక పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కొడాలి నాని ఆహ్వానించడంతో తాజాగా సంక్రాంతి పండుగలో గుడివాడ ప్రాంతంలో జరగబోయే ఎడ్ల పందేల కార్యక్రమాలను వీక్షించడానికి వైయస్ జగన్ మంగళవారం మధ్యాహ్నం బయల్దేరడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ వైయస్ జగన్ పరిపాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా ఈసారి సంక్రాంతి పండుగకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక గుడివాడ ప్రాంతానికి వైయస్ జగన్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాయని చెప్పారు. కాటికి కాలు చాపిన వయసులో కూడా చంద్రబాబు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను సంక్రాంతి పండుగను చేసుకోవద్దని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ధ్వజమెత్తారు. ఆయన సంక్రాంతి చేసుకోకపోతే రాష్ట్ర ప్రజలు చేసుకోకూడదా అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నారు అంటూ మంత్రి కొడాలి నాని సంతోషం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: