వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి  సీఎంగా ఉన్నంత వరకు తెలంగాణాకే లాభం, మంచి రోజులని టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. జగన్ సీఎంగా వున్నంత కాలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెడు రోజులేనని ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్ళూరు మండలంలో 144 సెక్షన్,30 పోలీస్ యాక్ట్ మహిళలు, రైతులపై ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు.144 సెక్షన్ అమలుపై హైకోర్టు కూడా ఆగ్రహించిన విషయాన్నీ ప్రస్తావించారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే 144 సెక్షన్ ఎలా పెడతారని నిలదీశారు. పోలీసు డిపార్ట్మెంట్ పై హైకోర్టు మండిపాటు రైతులకు సంతోషాన్నిచ్చే విషయమన్నారు. 

టెర్రరిస్టులు, నక్సల్స్ పై వాడే చట్టాన్ని రైతులు, మహిళలు పై ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం,పోలీసువాళ్ళు అమరావతి రైతులపై ఈ చట్టాలు వాడటం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కులను కలరాస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం హైకోర్టు తుది తీర్పులో ఛీఫ్ సెక్రటరీ, కలెక్టర్, డిజిపి, ఎస్పీలు హాజరవ్వాల్సి వస్తుందన్నారు. సెక్షన్ 144 తొలగిస్తే రైతులకు ఊరట లభిస్తుందని  అభిప్రాయపడ్డారు. అమరావతి ఆందోళనలు ఉదృతం చెయ్యవచ్చన్నారు. ప్రభుత్వం రాజధాని అమరావతి ఒకటే అనే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. జగన్ మెంటర్ కేసీఆర్ ని కలిశారు, ఆరుగంటలు ఏకాంత సమావేశం అయ్యారు చెప్పారు. మూడు గంటల పాటు ఏమి మాట్లాడుకున్నారో ప్రజలకు తెలియపరచలేదన్నారు. అమరావతిని ముడు ముక్కలు చేస్తున్నారని హరీశ్ రావు, రేవంత్  మాటలను బట్టి చూస్తే  అర్ధమవుతుందన్నారు. 

అమరావతి మూడు రాజాధానుల ప్రకటన వల్ల హైదరాబాద్ చాలా సంతోషంగా ఉందన్నారు.  మూడు ముక్కలు చేసిన తరువాత హైదరాబాద్ డవల్మెంట్ బాగా పెరిపోతుందని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి థాంక్స్ చెప్పిన కేసీఆర్. థాంక్స్ టూ జగన్-థాంక్స్ టూ ఆంధ్రప్రదేశ్ అని  కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుండి అమరావతికి దూరం తక్కువ అని అన్నారు.  హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావాళ్లు వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారని కుట్ర చేస్తున్నారని తెలుస్తుందన్నారు. 

ఎలక్షన్ టైంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుందన్నారు.  అమరావతి పతనాన్ని కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ గా  జగన్ ఇస్తున్నాడని ఆరోపించారు. రాజధాని మూడు ముక్కలు చెయ్యడం, తెలంగాణాకి ఎంతో బాగుంటుందన్నారు. అమరావతి గురించి ఇద్దరు సీఎం లు మాట్లాడకుండా,తెలంగాణా  ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారు. పోలవరం, అమరావతి గురించి మర్చిపోయి, మిగతా వాటి గురించి మాట్లాడతారని విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: