జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడలో పర్యటించనున్నారు. వైసీపీ కార్యకర్తలు చేసిన దాడులలో గాయపడిన వారిని జనసేనాని ఈరోజు పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే విశాఖ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరారు. రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ ఇంటికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. 
 
ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన ఉత్కంఠకు తావిస్తోంది. పోలీసులు కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో సెక్షన్ 144, సెక్షన్ 30ని విధించారు. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అధినేతపై అసభ్య పదజాలంతో దూషించాడని జనసేనాని కార్యకర్తలు ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటిని చుట్టుముట్టాలని ప్రయత్నించారు. 
 
ఆ సమయంలో కొందరు వైసీపీ శ్రేణులు జనసేన పార్టీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో జనసేన పార్టీ కార్యకర్తలు కొందరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలోనే పవన్ కళ్యాణ్ కాకినాడకు వస్తానని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం విశాఖ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడకు పయనమయ్యారు. పవన్ పర్యటన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. 
 
తుని పరిసర ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితులలోను కాకినాడ లోపలికి రాకుండా అడ్డుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. కాకినాడలో ఎక్కడ చూసుకున్నా పోలీసుల బలగాల మోహరింపు కనబడుతోంది. ప్రస్తుతం కాకినాడలో భారీ స్థాయిలో పోలీస్ బందోబస్త్ కొనసాగుతోంది. పోలీసులు కావాలనే సెక్షన్ 30, 144 దురుద్దేశపూర్వకంగా అమలు చేస్తున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: