ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజధానులను వ్యతిరేకిస్తూ భోగి మంటలు ఎగసిపడ్డాయి. ఈ  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న రాజధాని గ్రామ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు కుమార స్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను నేతలు భోగిమంటల్లో తగులబెట్టారు.
 
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగువారు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడంలేదన్నారు. అమరావతికి ఘన చరిత్ర ఉందని చెప్పారు.  అమరావతి కేంద్రంగా వేల ఏళ్ల క్రితమే రాజ్యం ఉండేదని ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు.  అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని బాబు పిలుపునిచ్చారు. అమరావతిని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం చేశారని గుర్తు చేశారు. తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఒకప్పుడు మద్రాస్‌ అభివృద్ధికి, తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధికి తాను కృషి చేశామన్నారు. అమరావతిని చించాలంటే భవిష్యత్‌ ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. భోగి మంటల కార్యక్రమంలో రాజధాని రైతులు, మహిళలు, యువత భారీగా హాజరయ్యారు.

ఇదిలా ఉండగా ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించాక అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసమీకరణ చేపట్టింది. గతంలో 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని కాదని ల్యాండ్ పూలింగ్ పేరుతో కొత్త విధానాన్ని సైతం తీసుకొచ్చింది. ఇందులో రాజధాని అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. తదనుగుణంగా సీఆర్డీయే ఏర్పాటుతో పాటు 33 వేల ఎకరాల భూసమీకరణకు సిద్దపడింది. అయితే రాజధానిలో భాగంగా ఉన్న ఉండవల్లి, పెనుమాకతో పాటు పలు గ్రామాల రైతులు మూడు పంటలు పంటే తమ సారవంతమైన భూములను రాజధానికి ఇవ్వబోమని తేల్చిచెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: