తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ను రెబల్ అభ్యర్ధులు వణికించేస్తున్నారు.  మొత్తం అన్నీ మున్సిపాలిటిల్లో కలిపి 3052 వార్డులు, డివిజన్లకు  25, 768 మంది నామినేషన్లు వేశారు. బిఫారాలు ఇవ్వాల్సిన గడువు కూడా మంగళవారమే ముగియటంతో  అధికారిక అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. వేసిన రెబల్స్   నామినేషన్లలో   అత్యధికంగా టిఆర్ఎస్ పార్టీలోనే ఉండటంతో  కేసియార్ నుండి ఎంఎల్ఏల వరకూ నానా అవస్తలు పడుతున్నారు.

 

ఉపసంహరణల తర్వాతనే ఎంతమంది బరిలో ఉండేది స్పష్టమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ప్రతి డివిజన్లోను, వార్డుల్లోను అధికారిక అభ్యర్ధులు రెబల్స్ అభ్యర్ధులు వెంటపడ్డారు. ఎలాగైనా రెబల్స్ తో నామినేషన్లు ఉపసంహరించుకునేట్లు చేయకపోతే గెలవటం కష్టమన్న అంచనాకు టిఆర్ఎస్ అభ్యర్ధులు వచ్చేశారు. అందుకనే రెబల్స్ తో మాట్లాడేందుకు నానా తంటాలు పడుతున్నారు.

 

రెబల్స్ సమస్య ఎక్కువగా టిఆర్ఎస్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అధికార పార్టీ నుండి అత్యధికంగా  8956 మంది పోటిలో నిలిచారు. తర్వాత  కాంగ్రెస్ నుండి 5356, 4176 మంది బిజెపి నుండి వేయటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే బిజెపి నుండి పోటి చేయటానికి కూడా ఇంతమంది పోటి పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

 

టిఆర్ఎస్ నుండి ఇన్ని వేల మంది రెబల్స్ గా పోటి చేయటమంటేనే విచిత్రంగా ఉంది. ఎందుకంటే పోటిలో ఉండే అధికారిక అభ్యర్ధులు నిజంగానే బలమైన అభ్యర్ధులు అయ్యుంటే పోటిగా రెబల్స్ ఇంతమంది నామినేషన్లు వేసేందుకు అవకాశం లేదు. దానికి తోడు కేసియార్ కూడా చాలా చోట్ల గట్టి అభ్యర్ధులను కాదని అనేక లెక్కలేసుకుని ఇతరులకు అవకాశం ఇచ్చారనే ఆరోపణలు వినబడుతున్నాయి.

 

ఇదే పద్దతిలో కాంగ్రెస్, బిజెపి అధికారిక అభ్యర్ధులకు కూడా రెబల్స్ బెడద ఉన్నప్పటికీ ప్రధానంగా టిఆర్ఎస్ అభ్యర్ధుల్లోనే టెన్షన్ పెరిగిపోతోంది. మరి నామినేషన్ల ఉపసంహరణ రోజున ఎంతమంది బరిలోనే ఉంటారు అనేదాన్ని బట్టే విజయావకాశాలుంటాయని తెలిసిందే. చూడాలి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: