హడావిడిగా మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం చూసి అంతా ఆయన్ను బీజేపీ అధిష్టానం పిలిచిందని, ప్రస్తుతం ఏపీలో అమరావతి ఉద్యమం ఊపందుకోవడంతో జనసేనను ముందు పెట్టి బిజెపి రాజకీయం చేస్తోందని, అలాగే జనసేన పార్టీ బీజేపీలో విలీనం చేయాల్సిందిగా పవన్ కు మరోసారి గట్టిగా చెప్పేందుకు బీజేపీ పెద్దలు ఆయన ఢిల్లీకి పిలిచారని, ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. అయితే అసలు నిజం ఏమిటో ఎవరికీ ఎప్పటి వరకు తెలియలేదు. అసలు హడావుడిగా ఢిల్లీకి వెళ్లిన పవన్ కు పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


 బిజెపి పెద్దల అపాయింట్మెంట్ కోసం పవన్ మూడు రోజులపాటు ప్రయత్నాలు చేసినా నిరాశ ఎదురైంది. ఆయనకు కేవలం ఏపీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవధర్ తో పాటు కేంద్రమంత్రి మురళీధరన్ అపాయింట్మెంట్ మాత్రమే లభించినట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ పర్యటనలో కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులను పవన్ కలిసినట్టుగా ప్రచారం జరిగింది . మూడు రోజుల పాటు పవన్ ఢిల్లీలో ఉన్నా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడం వరకే పవన్ సమయమంతా సరిపోయింది అని జరిగిన ప్రచారం అంతా ఉత్తిదే అని అర్థం అయిపోతుంది. పవన్ తనంతట తాను ఢిల్లీ వెళ్లినట్లు అర్థమవుతుంది. రాజధాని రైతుల తో భేటీ అయ్యి కేంద్రంతో నేను మాట్లాడుతానని వారికి భరోసా ఇచ్చారు. 

 

 అందుకే పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగించుకుని ఢిల్లీకి వెళ్లి అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ ప్రయత్నించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మోహన్ బాబు ఏ అధికారం లేకపోయినా, అతి సులువుగా మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ సాధించగలిగారు. మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో సహా వారిని కలిసి సుమారు గంట పాటు అన్ని విషయాలపై చర్చించారు. కానీ రాజకీయంగా బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉన్నా పవన్ మాత్రం ఆ విధంగా అపాయింట్మెంట్ సాధించలేకపోయారు. 


మూడు రోజులు ఉన్నా నిరాశే ఎదురయ్యింది.  ఇటీవల కాకినాడ ఎమ్మెల్యే  అనుచరుల చేతిలో రాళ్ల దెబ్బలు తిని గాయాలపాలైన తమ తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ వెళ్లారు 

మరింత సమాచారం తెలుసుకోండి: