మున్సిపల్ ఎన్నికలను రాజకీయ పార్టీలన్నీ ఒకింత సీరియస్ గానే తీసుకుంటున్నాయి. అందులోను అధికార పార్టీ మరీనూ. సమీక్షల మీద సమీక్షలు... నాయకులను పిలిచి మాట్లాడుతుంది పార్టీ నాయకత్వం. మరి మీరెందుకు మాట్లాడం లేదు...? వదిలేశారా.. అంటూ కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ నాయకత్వం మీద కస్పు బుస్సు మంటున్నారు.

 

కాంగ్రెస్ లో కస్సు బుస్సులు కామనైపోయింది. పార్టీ అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా... ఇక్కడ పంచాయితీలు అనేవి కామన్. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎలాగైనా పైచేయి సాధించే పనిలో పడింది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేయటం.... అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. సీఎం కేసీఆర్ ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నా... కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. నాయకులతో నేరుగా మాట్లాడుతూ నచ్చజెప్పే పని చేస్తున్నారు. ఐతే ఇది మన పార్టీలో కనిపించటం లేదేంటి అని కాంగ్రెస్ నాయకులు...పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మున్పిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల... ఆశించిన వారికి టికెట్లు రాలేదని...? ఓ వర్గం నాయకులు ఇంకో వర్గం వారికి బీ ఫామ్ ఇవ్వటం లేదనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. జిల్లాలకు ఇంచార్జీలుగా వేసిన వారితో కొన్ని సమస్యలు వచ్చాయి. వీటిని పరిష్కరించాల్సిన నాయకత్వం పెద్దగా పట్టించుకోవటం లేదని... ఇది పార్టీకి నష్టం వాటిల్లుతుందంటున్నారు సీనియర్లు. పీసీసీ చీఫ్ జిల్లాకే పరిమితం కాకుండా... అందరితో సమీక్షలు పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు.

 

జిల్లాలకు నియమించిన ఇంచార్జీలు సమన్వయం చేయటంతో పాటు.. ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహారాలను ఎప్పటిక్పప్పుడు పరిశీలించటం... అందుకు అనుగుణంగా క్యాడర్ కి దిశానిర్ధేశం చేయాల్సిన పార్టీ...అ పనిచేయటం లేదనేది సీనియర్ల అభిప్రాయం. ఎన్నికల నాటికైనా గాంధీ భవన్ లో నాయకులు అందుబాటులో ఉంటే....క్షేత్రస్ధాయి నాయకులకు ఇబ్బందులు వస్తే పరిష్కారం చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి అన్ని హంగులు ఉన్నా.. సమీక్షల మీద సమీక్షలు చేస్తుంటే...ప్రతిపక్ష పార్టీ కనీసం అలాంటి ప్రయత్నాలు చేయకపోవటం ఏంటనే వాదన ఉంది. ఐతే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే పార్టీ పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది కాబట్టి..అంతా సీరియస్ గా లేరనే టాక్ కూడా ఉంది. కానీ పార్టీ ఎవరి పరిధిలో మున్సిపాలిటీలు. కార్పోరేషన్ల బాద్యత వాళ్లకే అప్పగించిన తరువాత... పీసీసీ చీఫ్ గా మళ్లీ కొత్తగా చేసేది ఏముంటుందనే టాక్ ఉత్తమ్ వర్గం నుంచి వ్యక్తమవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: