ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భోగి పండుగ రోజున దారుణం చోటు చేసుకుంది. భర్త తనకు అమ్మఒడి డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగటంతో అమ్మఒడి డబ్బుల కొరకు భార్య, భర్త మధ్య గొడవ జరిగింది. పిల్లల కోసం ఖర్చు చేయానుకున్న డబ్బు పదేపదే ఇవ్వాలని గొడవ పడటంతో మనస్తాపానికి గురైన భార్య పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 
 
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో విషాదం జరిగింది. పురుగులమందు తాగిన మహిళకు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఊహించని ఈ ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు. పూర్తి వివరాలలోకి వెళితే మహేశ్వర్, ఆదిలక్ష్మి దంపతులకు బడికి వెళ్లే ఒక కూతురు ఉంది. 
 
అమ్మఒడి పథకానికి అర్హత సాధించటంతో అమ్మఒడి నగదు ఆమె బ్యాంకు ఖాతాలో నగదు జమైంది. బ్యాంకు ఖాతాలో జమైన డబ్బులను మహిళ విత్ డ్రా చేసుకొని ఇంటికి తీసుకొచ్చింది. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో గొడవ జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 
 
 ఏపీ సీఎం జగన్ ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థుల తల్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలలో చిచ్చు రేపుతోంది. అమ్మఒడి డబ్బులు తమకు ఇవ్వాలని భర్తలు భార్యలతో గొడవలకు దిగుతూ ఉండటంతో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. సీఎం జగన్ మంచి ఆశయంతో నగదును జమ చేస్తే ఆ డబ్బుల వలన కుటుంబాలలో గొడవలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. సీఎం జగన్ పథకాల అమలు విషయంలో పాటు ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: