నిరుపేదలకు ఉపాధి కల్పించాలని భావనతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 100 రోజుల పాటు గ్రామీణ ఉపాధి హామీ పనులను పేద ప్రజల కోసం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధి లేని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందరోజుల గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లి కాసిన్ని డబ్బులు సంపాదించుకుంటారు. ఎలాంటి వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ ఉపాధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ఉపాధి పనుల ద్వారా చెరువులు కుంటలు మరమ్మతులు చేయడంతో పాటు పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తూ చేయూతనిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాగా పేద ప్రజలకు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. 

 

 

 దేశంలోని ఎన్నో గ్రామాల్లో  ఉపాధి హామీ పనులు చేపట్టడం ద్వారా అటు చెరువులు కుంటల మరమ్మతులు జరగడంతో పాటు పేద ప్రజలకు వంద రోజుల పాటు ఉపాధి పనులు దొరికి... కాసిన్ని డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా గత కొన్ని రోజుల నుండి కేంద్ర ప్రభుత్వం నిరుపేద నిరుద్యోగులు అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి  పేద ప్రజలకు తమ కాళ్ళపై తాము నిలబడేలా ఉపాధి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. 

 

 

 ఇక తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఏడాదిలో 100 రోజుల పాటు గ్రామీణ ఉపాధిహామీ పనులకు వెళ్ళే వారికి ఉన్నతి పథకం పేరుతో స్వయం ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కల్పించే 100 రోజుల ఉపాధి పనులు నమ్ముకున్న కుటుంబాల్లో  18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారికి ఇంటికొకరు చొప్పున... ఎంపిక చేసి వారికి గ్రామీణ కౌశల్య యోజన.. కృషి విజ్ఞాన కేంద్ర, స్వయం ఉపాధి సంస్థల ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పొందే వారికి ఉపకార వేతనం కూడా ఇస్తారని అధికారులు తెలిపారు. ఇలా చేయడం ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు మేలు జరగడం తో పాటు స్వయం ఉపాధి కూడా పొంద గలుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: