జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్ధానాన్ని తెలియజేస్తున్న ఓ ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఆ ఫొటో ఆర్ఎస్ఎస్ స్టైల్లో ఉన్నది.  ఆ ఫొటోలో ఉన్న స్టైల్ అయితే ఆర్ఎస్ఎస్ ప్రముఖ్  లేకపోతే ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు వేసుకుని ఖాకీ నిక్కర్, షర్టు లో ఉంటుంది. కానీ ఈ ఫొటోను అదే ఖాకీ నిక్కర్, షర్టును  పవన్ వేసుకున్నట్లుగా మార్చారు లేండి. చూడ్డానికి పవన్ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ లాగే కనబడుతున్నట్లుంది.

 

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంపార్టీతోనే పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లే అనుకోవాలి.  ప్రజారాజ్యంపార్టీ అనుబంధమైన యువరాజ్యానికి పవన్ అధ్యక్షునిగా పనిచేసిన విషయం తెలిసిందే.  అందుకనే  2009లో పిఆర్పి అని పెట్టారు. తర్వాత అంటే 2014లో  టిడిపి, బిజెపితో కలిసి ఎన్నికల్లో పనిచేశారు. మిగిలిన రెండు పార్టీలు ఎన్నికల్లో పోటి చేసినా జనసేన మాత్రం పోటి చేయలేదు.

 

ఇక మొన్నటి ఎన్నికల్లో  అంటే 2019లో పవన్ సిపిఐ, సిపిఎం, బిఎస్పితో కలిసి పోటి చేశారు. సరే తాను పోటిచేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకల్లో చిత్తుగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.  ఎన్నికలకు ముందు తర్వాత కూడా చంద్రబాబుకు మద్దతుగానే పనిచేస్తున్నా అదంతా లోపాయికారీ ఒప్పందం మాత్రమే లేండి.

 

ఇపుడు తాజా పరిణామాల ప్రకారం పవన్ బిజెపితో కలిసి పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే బహుశా తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటి చేస్తాయేమో తెలీదు.  మరి అదే నిజమైతే చంద్రబాబునాయుడు పరిస్ధితేంటి అనేది పెద్ద ప్రశ్న.  అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి ఎన్నికకు పవన్ ఓ పార్టనర్ ను మారుస్తున్నారు. స్ధిరంగా ఒక్కళ్ళతో కూడా ఉండలేని పవన్ సమాజంలో ఏమి మార్పు తెస్తారు ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: