ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతి భవన్ లో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా ముందు నుండి రాజకీయంగా జగన్ ని ఇబ్బందులు గురి చేయాలని ఎప్పుడూ కాచుకు కూర్చునే ఏబీఎన్ ఆర్కే తన పత్రికలో కెసిఆర్ జగన్ భేటీ లపై ఇష్టానుసారం అయిన కథనాలు శీర్షిక పేజీలో రాయటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల విషయంలో కెసిఆర్ జై కొట్టినట్లు జగన్ నిర్ణయానికి అనుకూలంగా తాజాగా జరిగిన సమావేశంలో కేసీఆర్ పూర్తి మద్దతు ఇచ్చినట్లు తన ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఆర్కే ప్రచురించడం జరిగింది.

 

రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా తేలని విషయాల గురించి చర్చించి సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన సందర్భంలో ఆ సమస్యల గురించి ప్రస్తావించకుండా ఏబీఎన్ ఆర్కే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు రేపాలని జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావాలని ఈ విధమైన రాతలు రాయడం పై కథనాలపై వైసిపి పార్టీ నేతలు ఎప్పటి నుండో మండిపడుతున్న తాజాగా మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిజంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాంతంగా రెండు రాష్ట్రాల్లో ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం చర్చించుకుంటే వాటి గురించి మాట్లాడకుండా పత్రిక ఈ విధంగా తప్పుడు రాతలు రాయడం ఏంటని వాటిని నిరూపించగలరా …? ఏబీఎన్ ఆర్కే నీకు దమ్ముందా అంటూ దిమ్మతిరిగే షాక్ వైసిపి పార్టీ నేతలు ఇచ్చారు.

 

పత్రికలో ఇద్దరు నేతలు మాట్లాడిన మాటల విషయంలో బహిరంగంగా బయటకు వచ్చి ఏబీఎన్ ఆర్కే సమాధానం చెప్పగలరా..? అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు వైసీపీ నేతలు. ఇదే తరుణంలో కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవలు పెట్టాలని తన కథనంలో ప్రచురించిన వార్తలపై కూడా సీరియస్ అయ్యారు వైసిపి పార్టీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: