రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం తరలించాలన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కేంద్రప్రభుత్వం మద్దతు తెలిపిందా ? తాజాగా జరిగిన ఓ పరిణామం అందుకు ఊతమిస్తున్నట్లే ఉంది. విశాఖ రైల్వేజోన్ పరిధిలో వచ్చే కార్యాలయాలను, ఉద్యోగులందరినీ ఏప్రిల్ నెలలోగా విశాఖపట్నంకు తరలిస్తు కేంద్ర రైల్వేశాఖ  ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అంటే ఇపుడు ఈ కార్యాలయాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి లేండి.

 

విశాఖపట్నం ధక్షిణ తీర  రైల్వే జోన్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి రైల్వేజోన్ ఏర్పాటైనా కార్యాలయాలు, సిబ్బంది మాత్రం ఇప్పటికీ సికింద్రబాద్ లోనే ఉన్నారు. ఏపి విభజన చట్టంలో భాగంగా ఏర్పాటైన విశాఖ ధక్షిణ తీర రైల్వేజోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు పనిచేస్తున్నాయి.  కార్యాలయాలు ఏవీ విశాఖపట్నంలో ఏర్పాటు కాలేదు కాబట్టి సిబ్బంది మొత్తం సికింద్రాబాద్ నుండే పని చేస్తున్నారు.

 

అయితే జగన్ తాజా నిర్ణయం ఫలితంగా ధక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన కార్యాలయాలు, సిబ్బంది క్వార్టర్స్, మౌళిక సదుపాయాలు తదితరాల కోసం రైల్వే శాఖ రూ. 130 కోట్లు కేటాయించింది.  ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేజోన్ లో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  రైల్వేశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం సికింద్రాబాద్, విజయవాడ, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగులను విశాఖపట్నంకు తరలించే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం.  

 

ఒకవైపు విశాఖ రాజధానిగా చేయాలనే నిర్ణయంపై ప్రతిపక్షాలు అంటే బిజెపితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. అదే సమయంలో  జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా రైల్వేశాఖ ఉత్తర్వులు ఇవ్వటంతో బిజెపి నేతలు అయోమయంలో పడిపోయారు. రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసిందంటేనే కేంద్రం మద్దతు లేకుండా సాధ్యం కాదుకదా.

 

ఇక్కడ గమనించాల్సిందేమంటే కేంద్రం మద్దతంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి సపోర్టని అందరీకీ అర్ధమైపోతోంది. మోడికి తెలీకుండా ఏ శాఖ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకునేంత సీన్ లేదు. జగన్ నిర్ణయానికి మోడి ఆమోదం ఉన్న తర్వాత బిజెపి నేతలు ఎంత గోల చేసి ఉపయోగం ఏమిటి ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: