జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి కేవలం జగన్ ని మాత్రమే ప్రశ్నించడం అన్నట్టుగా గత కొంత కాలం నుండి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో 2014 ఎన్నికల్లో పార్టీని స్థాపించిన తర్వాత 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కేవలం ఆ సమయంలో ఒకే ఒక స్థానాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అయితే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ని ఇబ్బందులపాలు చేయాలని ఇసుక మరియు ఇంగ్లీష్ మీడియం, కులం మరియు మతం లాంటివి ఉపయోగించిన ప్రజలు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం అమరావతి రాజధాని విషయాన్ని లేవనెత్తి ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తో కలసి పని చేయడానికి సిద్ధమైనట్లు ఆయన ఢిల్లీ పర్యటన పట్ల వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఈ పర్యటనలో అమరావతి విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీలో ఉన్న బిజెపి పార్టీ పెద్దలు మోడీకి మరియు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలి అని తెగ ప్రయత్నించి ఢిల్లీలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ కి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తితో అపాయింట్మెంట్ ఏమిటని మోడీ మరియు అమిత్ షా పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా తో కలిసి చర్చించుకుని...పార్టీని బిజెపిలో విలీనం చేస్తే తప్ప మాట్లాడే ప్రసక్తే లేదని మోడీ మరియు అమిత్ షా తేల్చిచెప్పడంతో...పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బిజెపి పార్టీలో విలీనం చేయడానికి రెడీ అవుతున్నట్లు...ఆ తర్వాత రాజధాని అమరావతి విషయంలో ఎలాగోలాగా జగన్ ని ఇరుకునబెట్టి రాజకీయంగా ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్నట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి.

 

అయితే ఇటువంటి తరుణంలో ఆల్రెడీ వైయస్ జగన్ చంద్రబాబు తన వర్గీయుల కోసం కేవలం అమరావతి ప్రాంతంలోనే రాజధాని పెట్టాలని చూస్తున్నారని ఈ విషయాన్ని ముందే బిజెపి పెద్దలకు తెలియజేసి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నిర్ణయం అసెంబ్లీలో ప్రకటించారని...దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి పని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని జగన్ తీసుకున్న నిర్ణయానికి త్వరలో మూడు రాజధానుల పేరిట ప్రకటించే ప్రకటనకు పవన్ కళ్యాణ్ స్కెచ్ టోటల్ గా రివర్స్ అవుతుందని...జగన్ నిర్ణయానికి బీజేపీ కేంద్ర పెద్దలు చప్పట్లు కొట్టే పరిస్థితి వస్తే వాళ్లతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా కచ్చితంగా చప్పట్లు కొట్టాలని బీజేపీతో పొత్తు పెట్టుకుని లేకపోతే విలీనం చేసుకుని ఏదో పొడి చేద్దాం రాజకీయాల్లోకి వెళ్లాగ పెట్టేద్దాం అని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ కి జగన్ తనదైన శైలిలో రాజకీయం చేసి లాక్ చేసినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

 

అమరావతి రాజధానిగా ప్రకటించి చంద్రబాబు తప్పు చేశారని అసలు ఆ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని భవన నిర్మాణాలకు ఏ మాత్రం సహకరించని ఆ ప్రాంతాన్ని తన సామాజిక వర్గాల కోసం రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టడం దారుణమని మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం మళ్లీ విడిపోదని జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చాలామంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: