తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఇక ఉద్యోగాలు వ్యాపార నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లినవారు సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకోవడంతో గ్రామాలన్నీ నిండుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక బంధుమిత్రులతో సంక్రాంతికి అన్ని ఇల్లు నిండి పోతూ ఉంటాయి. ఇక సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ. ఈ మూడు రోజులు హడావిడి ఒక రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా చివరి రోజైన కనుమ నాడు అయితే అబ్బో ఆ హడావిడి మాటల్లో చెప్పలేనిది. ఆ రోజు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రజలు. 

 

 

 అంతేకాదండోయ్ కనుమ రోజు పశువులను పూజిస్తారు ఉంటారు. భోగినాడు భోగి మంటలు వేసి పీడలు  అన్ని తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని దేవుని ప్రార్థించినటు గానే... సంక్రాంతి పండుగ నాడు వాకిలి మొత్తం రంగురంగుల రంగవల్లులతో నింపేసి గొబ్బెమ్మలు పెట్టి సాంప్రదాయ వస్త్రధారణలో.. తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక కనుమ నాడు పాడిపశువులను పూజిస్తూ.. పాడి పశువుల్లో సకల దేవతలు ఉన్నారని స్మరించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పాడి పశువులను అందంగా ముస్తాబు చేస్తూ ఉంటారు. 

 

 

 సాధారణంగా పండగ అనగానే సరదా... అయితే మనుషులకు మాత్రమే నా ఈ పండగ సరదా అంటే కాదు మన సంస్కృతి పశువులకు కూడా సరదాగా ఉంటుందని చెబుతోంది. పశువులను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి మనది. అందుకే సంక్రాంతి పండుగ నాడు పశువులను అందంగా అలంకరించి.. పశువులకు కడుపునిండా ఆహారం పెట్టి... ఓ ప్రాంతంలో పశువులకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటార. అంతేకాకుండా పశువుల మధ్య పోటీ పెట్టి వాటి  సంతోషానికి కారణం కావడమే ఈ కనుమ ప్రాశస్త్యం. ఇక కనుమ పండుగ వచ్చిందంటే పశువులన్ని  అందంగా ముస్తాబై కనిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: