మున్సిపోల్స్ లో అధికార టీఆరెస్ పార్టీ టికెట్లు ఆశించిన పలువురు ఆశావహులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది . ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నాయకులు  తమకు పార్టీ బీఫామ్ ఇవ్వనందుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు . అయితే సకాలం పక్కనే ఉన్నవారు స్పందించి , వారిని వారించడం తో ప్రమాదం తప్పింది . జనగామ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీ టికెట్ ఆశించిన గంగాభవాని అనే మహిళా నాయకురాలు , తనకు బీఫామ్ ఇవ్వనందుకు నిరసనగా, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద  రోడ్డుపై బైఠాయించి పార్టీ కండువాతో ఉరి పోసుకునే ప్రయత్నం చేశారు .

 

అయితే అక్కడే ఉన్న పోలీసులు ఆమెను వారించి, ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్నారు . ఇక మేడ్చల్ లోను ఇదే పరిస్థితి నెలకొంది . విజయ్ అనే నాయకుడు టికెట్ రానందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు . ఇక సూర్యాపేట లోను అబ్దుల్ రహీమ్ అనే కార్యకర్త పార్టీ బీఫామ్ ఇవ్వకపోవడం ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా , సకాలం లో కుటుంబ సభ్యులు స్పందించి అతన్ని కాపాడారు .  ఆదిలాబాద్ మాజీ చైర్మన్ మనీషా కు బీఫామ్ దక్కకపోవడం తో ఆమె నేడు తన  నామినేషన్ ఉపసంహరించుకున్నారు . అయితే పార్టీ టికెట్ దక్కకపోవడం పట్ల కన్నీటి పర్యంతమయ్యారు .

 

ఇక పార్టీ టికెట్ దక్కలేదని పలువురు పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ , బీజేపీ కండువాలను కప్పుకున్నారు . నగర శివారు బడంగ్ పేట , మీర్ పేట , బోడుప్పల్ , పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన  పలువురు నాయకులు అధికార పార్టీ టికెట్ కోసం చివరి వరకు  ప్రయత్నించి ,  దక్కకపోవడంతో చేసేది లేక తిరుగుబాటు అభ్యర్థులుగా  పోటీ చేసేందుకు రెడీ అయ్యారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: