జనసేన అధినేత ఢిల్లీ టూర్ నుంచీ ఆగమేఘాల మీద వైజాగ్ చేరుకొని, అక్కడి నుంచీ కాకినాడ వెళ్ళి, నేరుగా పంతం నానాజీ ఇంటికి వెళ్ళారు. అక్కడ జనసేన, వైసీపీలకి మధ్య  జరిగిన గొడవలలో గాయపడిన తన జనసేన కార్యకర్తలని పరామర్శించారు. పరమర్సలు అనంతరం  వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఘటన తాలూకు డ్యామేజ్ చెప్తూనే ఎప్పటిలానే మేం తెగిస్తే ఎవరూ ఉండరూ అంటూ ప్రసంగాలు చేసేశారు.

 

ఇదిలాఉంటే ఎవరూ ఉండని ప్రాంతానికి రాజయిపోతావా బాసు అనే సందేహం చాలా మంది ప్రేక్షక దేవుళ్ళకి కూడా వచ్చిందట. అంతేనా అసలు జనసేన కార్యకర్తలు ఏమి చేయకుండానే వైసీపీ వాళ్ళు గొడవకి దిగారా..?? అంటూ బుర్రలు పైకి లేపి చేయి చేయి కలిస్తేనే చప్పట్లు కదా అటూ మరో సందేహం గుర్తు బుర్రలో వెలిగించారట. ఇదిలాఉంటే  ఈ ప్రసంగం మధ్యలోనే పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 

ఢిల్లీ టూర్ లో ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడాను అంటూ సాదారణ రాజకీయ నేతలానే చెప్పారు కానీ టూర్ వెనుక అసలు కారణం మాత్రం చెప్పలేదు. ఇక్కడ జరిగన ప్రతీ విషయం కేంద్రం దృష్టిలో పెట్టా ఇక కేంద్రమే అన్నీ చూసుకుంటుంది అన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు ఉండటం కొంత ఆసక్తిని రేకెత్తించాయి. మరో అడుగు ముందుకు వేసిన పవన్ సభకి నమస్కారం తెలిపే సమయంలో  త్వరలో అంటే 16 న విజయవాడలో బీజేపీ తో కీలక మీటింగ్ ఉంటుందని చెప్పారు. అయ్యో సర్ అది నా డైలాగ్ అంటూ పవన్ కి అత్యంత సన్నిహితుడైన నాదెండ్ల మనోహర్ మైకు తీసుకుని విజయవాడలో బీజేపీ తో కీలక మీటింగ్ ఈ నెల 16 న ఉంటుందని చెప్పారు. అదేంటి పవన్ ఇదేగా చెప్పింది అంటూ మరో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట జర్నలిస్ట్ సోదరులు. సరే ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ

 

16 తేదీ కనుమ రోజున బీజేపీ, జనసేన కీలక మీటింగ్ అని ప్రకటించగానే ఎవరి బుర్రలు వారి వారి స్థాయికి  తగ్గట్టుగా ఆలోచనలో పడ్డారు. కొంతమందికైతే జనసేన అధినేతకి ఏపీలో పార్టీని నడపలేమనే క్లారిటీ వచ్చింది కాబట్టి , ఇక ఈ మీటింగ్ అనంతరం జనసేన ని బీజేపీలో విలీనం చేసేస్తారా అనే సందేహం వచ్చిందట. ఇంకొంతమంది ఇకపై ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి బీజేపీ తో కలిసి నడవడానికి రెండు పార్టీలు ఏకం అవ్వడానికే ఆ మీటింగ్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరి అభిప్రాయం వారిదే అయినా పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే 16 వరకూ వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: