మీరు మర్యాదగా మాట్లాడితే మేము అంత కంటే మర్యాదగా మాట్లాడుతామని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  స్పష్టం చేశారు. ఆ మాటలు అన్నందుకు బాధగా ఉంది అయినా తెలియాలని అన్నాను. పవన్ కళ్యాణ్ కి తప్పుడు సంకేతాలు ఇచ్చింది పంతం నానాజీ. ఘర్షణలో కాకినాడకు చెందిన వీర మహిళలు ఎవరూ లేరన్నారు. ధర్నాలు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి, మా ఇల్లు ధ్వంసం చేయాలని ఉద్దేశ్యంతో చేసిన ధర్నా ఇది. ధర్నా చేస్తామని అనుమతి తీసుకొని భానుగుడి నుండి బయలుదేరి మా ఇంటిపై దాడికి ప్రయత్నం చేయించారు పంతం నానాజీ.

జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో మా కార్యకర్తలు కూడా ప్రతిఘటించారు. జనసేన కార్యకర్తలు దెబ్బలు తగలకుండా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లు సైతం ఎమ్మెల్సీ కోసం బెదిరించారు. 30 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్న ఇటువంటి సంఘటన కాకినాడలో ఎప్పుడూ జరగలేదు ఇదే ప్రథమం. మా నాయకుడని ఏమైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ హుందాతనంగా మాట్లాడితే మేము కూడా హుందాతనంగా మాట్లాడితాం

ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పెట్టారో పవన్ కళ్యాణ్ కు తెలియదా. మొదటి నుండి జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడుగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఎంత నీచమైన రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. మొదట ఇసుక నూతన విధానాన్ని  వ్యతిరేకించారు, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం, తర్వాత అమరావతిని ఎంచుకున్న మహా ఘనుడు చంద్రబాబు.

ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలని మాట్లాడితే ఊరుకునేది లేదు. నా మీద పార్టీ మీద అభిమానం తో మూడు రోజులపాటు నాకు తోడుగా ఉన్న కార్యకర్తలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పాత్రికేయుల సమావేశంలో డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ్ బాబు, నగర అధ్యక్షుడు రాగి రెడ్డి ఫ్రూటీ కుమార్, వైసిపి కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: