అమరావతికి  హడావిడిగా ఎన్నికలకు ముందు చంద్రబాబు  ప్రభుత్వం 53 వేల కోట్ల  (52,837  కోట్లు )  అంచనాలతో  టెండర్ లు పిలిచింది. ఇప్పుడేమో డబ్బే  అవసరం లేదు అంటున్న చంద్రబాబుది నోరా తాటి మట్టా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం లక్షా 9  వేల కోట్లు కావాలని కేంద్రానికి డిపిఆర్  (డిటైల్డ్  ప్రాజెక్ట్ రిపోర్ట్ )ని సి సిఆర్ డిఏ పంపింది. లక్ష కోట్లు కావాలి అని అప్పటి టీడీపీ మంత్రి నారాయణ వెల్లడించారు. కాగా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని వద్దని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. దేశంలోని అత్యంత పది ధనిక నగరాల్లో విశాఖ ఒకటి. అన్ని వసతులు ఉన్న మహా నగరం విశాఖ. అక్కడ సచివాలయం పెడితే కేవలం 5 వేల కోట్లతో హైదరాబాద్ ను తలదన్నే నగరం అవుతుంది అని మాజీ చీఫ్ సెక్రటరీ ఐ వై ఆర్ కృష్ణారావు అన్నారు. 

ఇప్ప‌టికే విశాఖ‌లో ల‌క్ష మంది ప‌బ్లిక్ ప్రైవేట్ సెక్టార్‌, నేవీలో ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌, హిందూస్థాన్ షిప్ యార్డ్‌, రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్‌, విశాఖ స్టీల్ ప్లాంట్‌, భార‌త్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సెల్స్‌, ఈస్ట‌న్ నావెల్‌ క‌మాండ్‌, ఐటీ ఇండ‌స్ట్రీ, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో ఉన్న 10 ధ‌నిక న‌గ‌రాల్లో విశాఖ ఒక‌టి. గుజ‌రాత్‌లోని సూర‌త్ త‌ర్వాత విశాఖ అతిపెద్ద సిటీ.
చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు విశాఖ‌లో జ‌రిగిన మూడు పారిశ్రామిక స‌మ్మిట్‌ల‌లో చంద్ర‌బాబు అంద‌రినీ అమ‌రావ‌తి వ‌చ్చి పెట్టుబ‌డులు పెట్టండి అని అడ‌గడంతో ఎవ‌రూ ముందుకు రాలేదు. అదే విశాఖ వ‌చ్చి పెట్టుబ‌డులు పెట్టండి అంటే అంద‌రూ ముందుకు వ‌చ్చేవాళ్లు అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ ఫెడ‌రేష‌న్ డైరెక్ట‌ర్ న‌రేష్ కుమార్ చెప్పారు. అదే విశాఖపట్నాన్ని   రాజ‌ధానిగా ప్ర‌క‌టించి ఉంటే దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పోటీప‌డి ఉండేదని, పెట్టుబ‌డులు వ‌చ్చేవ‌ని న‌రేష్ అన్నారు.

విశాఖ‌లో 15 వేల ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి అందుబాటులో ఉండ‌డం వ‌ల‌న శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ కూడా విశాఖ‌ప‌ట్నాన్ని ప‌రోక్షంగా సూచించింద‌ని ఒక ఉన్న‌తాధికారి చెప్పారు. నేష‌న‌ల్ హైవే 16(ఎన్‌హెచ్‌-16) వెంబ‌డి 15వేల ఎక‌రాల భూములు ఉండ‌డం వ‌ల‌న ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. వాస్తు రీత్యా విశాఖ చాలా బాగుంది, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంద‌ని వాస్తు నిపుణులు రేజేటి గోప ఆచార్యులు అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిసెంబ‌ర్ 28, 2019న విశాఖ వ‌చ్చిన‌ప్పుడు 24 కిలోమీట‌ర్ల మేర (ఎయిర్ పోర్టు నుంచి ఆర్కే బీచ్‌) మాన‌వ హారం నిర్వ‌హించి విశాఖ వాసులు త‌మ హ‌ర్షాతిరేఖాల‌ని చాటుకున్నారు.

అమరావతిపై విశ్లేషకులు ఏమన్నారంటే 

1.అది అమరావతి కాదు భ్రమరావతి. - విశ్లేషకులు తెలకపల్లి రవి

2.అమరావతి అనేది ఒక అతి ఘోరమైన, అవినీతి కరమైన నిర్ణయం ఘోరమైన వైఫల్యం. - ప్రొఫెసర్ నాగేశ్వర్

3. కమ్మ కులం వలన బాబుకు చెడ్డ పేరు వస్తోందా లేక చంద్రబాబు వలన కమ్మ కులానికి చెడ్డ పేరు వస్తోందా అనేది ఆలోచించాలి. 

4 . అమరావతి మారిస్తే కమ్మ వాళ్ళు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవాలి అని ఆంధ్ర జ్యోతి ఎం డి రాదక్రిష్ణ కధనం.
అది ఒక కుల రాజధాని అని ఆయనే చెబుతున్నాడు. -విశ్లేషకులు తిలక్

ఇక ప్రపంచ భ్రమరావతి గురించి 

1.పార్టీ ఏదైనా కానీ కమ్మ నాయకులు (సిపిఎం  నారాయణ, సిపిఎం  రాఘవులు బీజేపీ రఘనాధ బాబు, పురందేశ్వరి , రమేష్ నాయుడు , కాంగ్రెస్ సుంకర పద్మశ్రీ .. విశ్లేషకులు లక్ష్మి నారాయణ, కుండబద్దలు సుబ్బారావు , చలసాని , C నరసింహారావు..లోక్ సత్తా జేపీ, ఏపీ 24/7 సిఈఓ  వెంకట కృష్ణ,ఈనాడు రామోజీ రావు,  జ్యోతి రాదక్రిష్ణ, TV5 నాయుడు .. తదితరులు,) రాజధాని మార్చితే ఒప్పుకోము అని అంటున్నారు. - ఇండియన్  ఎక్స్ ప్రెస్   ఎడిటర్ సిహెచ్ ఎం వి కృష్ణ రావు

2.అమరావతిని ఎవరూ ఓన్ చేసుకోలేదు., రాజధాని అనేది ఏ ఒక్కరికో సొంతం కాకూడదు. - గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన సినీ రచయిత కోన వెంకట్

3.అమరావతి ఒక వర్గం(కులం) కోసం కట్టుకున్న రాజధాని. విశాఖ అన్ని విధాలా బెస్ట్ , హైదరాబాద్ తో పోటీ పడుతుంది. - మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్  కృష్ణ రావు

4. విజయవాడ కులపిచ్చికి పుట్టిల్లు. బాబు కమ్మ కాబట్టి రాజధాని రైతులు భూములిచ్చారు. - ఆగష్టు 2019 లో  జ్యోతి  రాధాకృష్ణ ఎడిటోరియల్

5. హైదరాబాద్ కంటే విజయవాడ లో అద్దెలు ఎక్కువ. పైగా కులం అడిగి కానీ ఇల్లు అద్దెకు ఇవ్వరు, ఇలా అయితే ఎవరు వస్తారు. - 2017 లో అప్పటి సీఎం చంద్రబాబు

6. అమరావతి ఒక కులం కోసం కడుతున్న రాజధాని. - దళిత మేధావి డాక్టర్ కత్తి పద్మారావు

7. అమరావతి శంకుస్థాపనకు మోడీ వచ్చినప్పుడు స్టేజి మీద అంతా కమ్మోల్లే ఉన్నారు. - కాపునాడు నేత ముద్రగడ పద్మనాభరావు

8. అమరావతి ఒక కులం కోసం కట్టుకొంటున్న రాజధాని. - నవంబర్ 10 , 2016 న అనంతపూర్ సభలో జనసేనాని పవన్

9. అమరావతి లో ఎకరం 50 లక్షలకు తక్కువ లేదు. కాబట్టి అక్కడ పరిశ్రమలు రావు., కానీ రాజధాని మార్చకూడదు. - బీజేపీ  రఘునాధబాబు 

10. అమరావతి రాజధానిగా పనికిరాదు. - గుంటూరు జిల్లాకు చెందిన ఆర్ధిక వేత్త పాపారావు. 

11. కమ్మ కులస్థుల కోసం విజయవాడ -గుంటూరు మధ్య లో రాజధాని పెట్టాడు బాబు అని టైమ్స్ అఫ్ ఇండియాపత్రిక మే 18 , 2014 న రాసింది

12.జూన్  8 ,2014 న ప్రమాణ స్వీకారం చేసిన బాబు ,డిసెంబర్ 30 , 2014 న అమరావతిని రాజధానిగా ప్రకటించారు. 

రాజధాని ప్రకటనకు ముందు (2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు) కేవలం ఆర్నెళ్ల వ్యవధిలో 4,070 ఎకరాలను చంద్రబాబు, ఆయన సన్నిహితులు లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, తుళ్లూరు .. లాంటి మారుమూల పల్లెల్లో కొనడం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాక మరేమిటి..? 

13. హైదరాబాద్ జీడీపీ లో సగం కంటే ఎక్కువ విశాఖది. (హైదరాబాద్ జిడిపీ 75 .2 బిల్లియన్ డాలర్లు. విశాఖ జిడిపీ 43.5 బిలియన్ డాలర్లు. 

ఒక బిలియన్ అంటే వంద కోట్ల డాలర్లు. జిడిపీ అనేది అభివృద్ధ్ది సూచిక)

3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న 13 జిల్లాల ap కి, 54 వేల ఎకరాల్లో లక్ష 9 వేల కోట్లతో భ్రమరావతి అవసరమా?

బాబు ముందుగా కొన్న   4  వేల ఎకరాల కోసం  మరియు తన కులస్థుల కోసం రాష్ట్రం మొత్తంగా అప్పుల కుప్ప కావాలా?

హైదరాబాద్ లో అన్నీ పెట్టి చూసాక కూడా వికేంద్రీకరణ చేయకూడదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: